హీరోయిన్ వేదిక కుమార్ దక్షిణాదిలో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ సినిమాలు చేస్తూ నవతరం బ్యూటీల్లో వేదిక ప్రత్యేకత చాటుకుంది. అందం, అభినయం ఉన్నా ఇంకా ఏదో లోటు ఉంది అన్నట్టుగా చూపుతిప్పుకోలేని ఫోటోలతో వేదిక సెగలు పుట్టిస్తోంది.
కన్నడ మూలాలు కలిగిన వేదిక 1988లో మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించింది
ముంబైలో ప్రాధమిక విద్య పూర్తి చేసిన వేదిక… లండన్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో MSc పూర్తిచేసింది
కథక్, భరతనాట్యం నేర్చుకున్న వేదిక… చదువుకునే రోజుల్లోనే ఒక వీడియో ఆల్బం చేసింది.
2006లో మద్రాసీ తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
అర్జున్, జగపతి బాబు హీరోలుగా నటించిన తమిళ అనువాద సినిమా శివకాశి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది.
నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేదిక తొలినాళ్లలో హిట్లు అందుకోలేకపోయింది
నారా రోహిత్ నటించిన బాణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరం అయ్యింది …
అవార్డులు, రివార్డులు భారీగానే అందుకున్న వేదిక… అంద చందాల వడ్డింపులోను రికార్డులు సృష్టిస్తోంది
courtesy : instagram