అందానికే అందం హీరోయిన్ అయేషా ఖాన్ సొంతం. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసిన అయేషా ఖాన్ ముద్దబంతి ముఖారవిందం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆహా అనిపిస్తున్న ఆయేష్ ఖాన్ అందాల ఫోటోల కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఎదురుచూస్తుంటారు.
అయేషా ఖాన్ 2002 సెప్టెంబర్ 13వ తేదీన ముంబైలో జన్మించింది
బీహార్ కు చెందిన అయేషా కుటుంబం ఉన్నత విద్యావంతులు కావడంతో అమ్మడిని పంచరంగుల ప్రపంచంలోకి అనుమతించారు.
జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 2019లో బాలవీర్ రిటర్న్స్ లో తన నటనతో విమర్శకులను మెప్పించింది
అయేషా 2022లో ముఖచిత్రం తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది
2023లో హిందీ బిగ్ బాస్ సీజన్-17లో కంటెస్టెంట్‌గా పాల్గొంది
2024లో రియాల్టీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడీ’తో ఉత్తరాదిన పేరు తెచ్చుకుంది.
2024లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి…. ఓం భీమ్ బుష్ సినిమాల్లో చేశాక ఈ అప్సరస కోసం కుర్రాళ్లు తెగ సెర్చ్ చేశారట
2025లో హిందీలో సన్నీ డియోల్ తో కలిసి జాట్ సినిమా చేసి బాలీవుడ్ లో అడుగుపెట్టింది
హిందీతో పోలిస్తే తెలుగులోనే అధికంగా సినిమాలు చేసిన 23 ఏళ్ల బ్యూటీ వయ్యారాల ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
courtesy : instagram