32 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్ దక్షిణాది సినీ పరిశ్రమలో బిజీ హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్న మలయాళ కుట్టి…అందాల ఆరబోతకు కాకుండా నటనకు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది.1996లో కేరళలోని త్రిస్పూర్ జిల్లాలో జన్మించిన అనుపమ…2015లో మొదట ప్రేమమ్ సినిమాతో మళయాల సినీ రంగంలోకి అడుగుపెట్టింది.ప్రాథమిక విద్యాబ్యాసం కొట్టాయంలో చేసిన అనుపమ..ఆ తర్వాత కమ్యూనికేటివ్ ఇంఘ్లీష్ లో డిగ్రీలో చేరినా… నటన కోసం మధ్యంతరంగా చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చింది.

2016లో నితిన సరసన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాలో సమంతతో పాటు ప్రాధాన్యమున్న పాత్రలో అనుపమ నటించింది.

2016లోనే కోడి సినిమా ద్వారా కోలీవుడ్ (తమిళ సినీ పరిశ్రమ)లోకి ఎంటర్ అయిన అనుపమ…ఇక ఎదురు లేదన్నట్టుగా సినిమాలు చేస్తోంది.

ప్రేమమ్ తెలుగు వెర్షన్ లో నాగ చైతన్య సరసన చేసి సినీ అభిమానులను మెప్పించింది.

2017 అక్టోబరులో విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో రామ్‌ పోతినేని సరసన నటించింది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది.

2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌తో జంటగా అనుపమ నటించింది. 

2017లొనే మలయాళ సినిమా “జొమొంతె సువిశేషంగళ్” అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో మళయాళ హీరో మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సరసన చేసి క్రేజీగా మారింది.

బైసన్(తమిళం) పరదా(తెలుగు) తదితర సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

courtesy : instagram

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com