పంజాబీ గ్లామర్ క్వీన్ ఇషా రిఖి. పంజాబీ సినీ రంగంలో గ్లామర్ పాత్రలు పోషించి పాపులారిటీ సాధించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉండే రిఖీ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
1993లో జన్మించిన ఇషా మొదటగా మోడల్ గా కెరీర్ ప్రారంభించి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
అందాల భామ ఇషా రిఖి మొదట 2012లో జాట్ అండ్ జూలియట్ పంజాబీ సినిమాలో అథితి పాత్ర ద్వారా వెండితెరపై మెరిసింది
ఈ ముద్దగుమ్మ 2013లో జట్ బాయ్స్ పుట్ జట్టా దే పంజాబీ సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్ గా అభిమానులను మెప్పించింది.
2014లో హ్యాపీ గో లక్కీ, మేరే యార్ కమీనీ సినిమాలతో పంజాబీ రంగంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.
ఇషా ప్రీత్ హర్పాల్ తో కలిసి B.A ఫెయిల్ తోపాటు ఇక్ సాల్, హీరో, చోరి ద పిస్టోల్ వంటి వివిధ పంజాబీ భాషా మ్యూజిక్ అల్బమ్స్ లో చేసింది
2018లో నవాబ్ జాదే సినిమాతో బాలీవుడ్ సినిమారంగంలో ప్రవేశించిన ఇషా రిఖి…వివాదాలకు కూడా కేంద్రబిందువుగా నిలిచింది.
పంజాబీ సింగర్ బాద్షా తో డేటింగ్ లో ఉందని ఇషా రిఖి పై పుకార్లు లేచాయి. దీంతో 2023లో మీడియా పతాక శీర్షికల్లో నిలిచింది.
ఓ పార్టీలో ఇద్దరం కలిసి ఉన్నంత మాత్రాన ఇషా రిఖితో డేటింగ్ అని దుమారం లేపటం సరికాదని, తనకు ఎలాంటి సంబంధం లేదని బాద్షా వివరణ ఇవ్వడంతో పుకార్లు సద్దుమణిగాయి
courtesy : instagram