ఓ మైనర్ బాలికను మోసగించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఎనిమిదొవ అదనపు జడ్జి న్యాయస్ధానం ఇరవై ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామానికి చెందిన తిమ్మగల శ్రీనాధ్ ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గర అయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేకసార్లు లైంగికంగా దాడి చేసి తరువాత వివాహాం చేసుకోనని తిరస్కరించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు శ్రీనాధ్‌పై కందుకూరు పోలీస్ స్టేషన్లో 2017వ సంవత్సరంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ఎల్‌బీనగర్‌లోని రంగారెడ్డి జల్లా కోర్టుల సముదాయంలో ఉన్న ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి న్యాయస్ధానం సోమవారం నిందితుడు శ్రీనాధ్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షి విధుస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. అలాగే బాధితురాలికి మూడు లక్షల రూపాలయు నష్టపరిహారం చెల్లించాలని నిందితుడ్ని కోర్టు ఆదేశించింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.మంజులాదేవి ఈ కేసులో బాధితురాలి తరపున వాదనలు వినిపించారు.