36.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

తెలంగాణలో సంక్షేమ పథకాల పండగ

ఆదివారం నుంచి 4 కీలక పథకాల ప్రారంభం
రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న ప్రభుత్వం.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా సంక్షేమానికి శ్రీకారం.
అర్హులైన అందరికీ పథకాల అందుతాయి ఆందోళన చెందవద్దు. బట్టి
మార్చి నెలాఖరులో అర్హులైన వారందరికీ పథకాలు అందేలా కార్యాచరణ

సంక్షేమానికి నాంది పలుకుతూ తెలంగాణ వ్యాప్తంగా రిపబ్లిక్ డే సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్నాయి.. గణతంత్ర దినోత్సవం రోజు ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో నాలుగు కీలకమైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది.. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు.. ఈ నాలుగు పథకాలను ప్రతి మండలంలోని ఎంపిక చేసిన ఒక గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభిస్తారు.. ఈ పథకాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రులు అధికారులతో భేటీ అయ్యారు..

పండగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు.. అయితే ఈ కార్యక్రమం ఒక రోజుకు పరిమితం చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందేలాగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. మార్చి చివర్లోగా రాష్ట్రంలో అర్హులైన అందరికీ ఈ పథకాలను అందజేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. గ్రామసభలో వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తున్నామని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తూ అర్హులైన వారందరికీ ఇచ్చేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
గ్రామ సభల్లో విపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాయని.. వాస్తవానికి ప్రజలు ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు.. ఈ నాలుగు పథకాలు అత్యంత కీలకం కావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో రెండో విడత ఈ కార్యక్రమాల ప్రారంభంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com