27.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

ట్రంప్ గెలిస్తేనా.. ఈ పరిస్థితే వచ్చేది కాదు: పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలకం అనేకంటే సంచలనం అంటే కరక్ట్ ఏమో. మరి పుతిన్ చేసిన వ్యాఖ్యలు అలాంటివి. పుతిన్‌ మాట్లాడిన వ్యాఖ్యల్లో కీలకమైనవి ఏంటంటే..

* 2020లో ట్రంప్ అధ్యక్షుడు అయ్యుంటే 2022లో ఉక్రెయిన్‌ సంక్షోభం వచ్చి ఉండేది కాదు.
* ట్రంప్‌ గెలుపును దొంగిలించారు. ట్రంప్ చాలా తెలివైనవారు. ట్రంప్ ఆచరణాత్మకంగా ఆలోచించి పనిచేయగలరు.
* ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి చర్చలు జరపడానికి రష్యా సిద్ధం.
* అమెరికా సాయంతో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించడానికి రష్యా సిద్ధంగా ఉంది.
* ట్రంప్‌తో మాట్లాడేందుకు ఆసక్తిగానే ఉన్నాను.
* 2020లో ట్రంప్‌ విజయాన్ని బైడెన్ దొంగిలించారు. ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది.

ఇవీ పుతిన్ మాట్లాడిన వాటిలో కీలకాంశాలు. ఆయన తీరు చూస్తుంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అమెరికా ఓ అడుగు ముందుకు వేయడమే ఆలస్యం.. పుతిన్‌ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటేంటే అటు ట్రంప్, ఇటు పుతిన్ ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూనే యుద్ధంపై మాట్లాడుతున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఏమాత్రం సిద్ధంగా లేకపోవడం. పుతిన్ స్టేట్‌మెంట్‌ వచ్చిన కొద్దిసేపటికే జెలెన్ స్కీ స్పందించారు. కేవలం అమెరికాతో మాత్రమే కాదు.. యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా చర్చల్లో పాల్గొనాల్సిందే అని కొత్త మెలిక పెట్టారు. అతని తీరు చూస్తుంటే యుద్ధాన్ని ఆపేందుకు ఏ మాత్రం కూడా సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది.

నిజానికి ఉక్రెయిన్ యుద్ధానికి వెన్నెముకగా ఉన్నది అమెరికా. ఆ దేశం చేసే ఆర్థిక, ఆయుధ సాయంతోనే ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది. ప్రస్తుతం అధికారం చేజిక్కించుకున్న ట్రంప్.. అమెరికన్ డాలర్లను ఏ మాత్రం ఉక్రెయిన్‌పై ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో ఉక్రెయిన్ పరిస్థితి అడకత్తెరలో పొక చెక్కలా తయారైంది. మరి నిజంగానే ట్రంప్‌ శాంతి చర్చలు అని రంగంలోకి దిగితే ఉక్రెయిన్ అసలు ఆలోచన ఏంటి అనేది బయటపడుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com