22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

ట్రంప్‌ రెండో దఫా.. అగ్రరాజ్యానికి లాభమా? నష్టమా?

రెండు రోజులకే ఐదేళ్లు పవర్‌ లో ఉన్న ఫీలింగ్‌
ఎడా పెడా ఆదేశాల జారీ.. ఆరు కీలక ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు
అన్నింటికీ అమెరికన్ కంగ్రెషన్ ఆమోదం లభిస్తుందా?
ఇమ్మిగ్రేషన్ పాలసీపై అన్నంత పనీ చేస్తున్నారా?
ప్రత్యర్ధులపై కక్ష సాధింపు చర్యలు..
అగ్రరాజ్యం రుబాబు కొనసాగింపు..
రష్యా, చైనాలకు వార్నింగ్‌
టిక్‌ టాక్‌ కొనేయాలని మస్క్ కు సూచన
ఈయూ దేశాలనూ తన వార్నింగ్‌ తో భయపెట్టిన ట్రంప్‌
ఇవి చిటపటలేనా? లేక దమ్మున్న నిర్ణయాలా?

డోనాల్డ్ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి రాగానే చెలరేగిపోతున్నారు. కరవాలం ఝుళిపిస్తున్నారు.. చెప్పిన హామీలన్నీ నెరవేర్చి అభిమానులకు ఆత్మీయుడుగా మారిపోతున్నారు. అదే టైమ్‌ లో వ్యతిరేకులకు సింహస్వప్నం అయి కూర్చుంటున్నారు. తన రెండో రాకడ అమెరికాను సమూలంగా మార్చేస్తుందని ఎన్నికలకు ముందే చెప్పిన ట్రంప్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ట్రంప్‌ గద్దెనెక్కినది రెండు రోజుల క్రితమే.కానీ రెండేళ్లుగా పవర్ లో ఉన్నారా అన్న ఫీలింగ్‌ కలుగుతోంది. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఆరు కీలక అంశాలపై సంతకాలు చేసేసి ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. నయా ఇమ్మిగ్రేషన్‌ రూల్స్ తో వలసదారుల గుండె గుభేల్మనిపించారు. ఐదు వందల బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ పెట్టుబడులపై సంతకం పెట్టారు. మెక్సికో తీరం పేరు మార్చేశారు.ఫెడరల్‌ ప్రభుత్వంలో వైవిధ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. సోషల్‌ మీడియా పోస్టులలో ప్రత్యర్ధులపై వీర విహారం చేశారు. విస్తరణ కాంక్షను బయటపెట్టారు. దారికి రాకపోతే వాణిజ్య పరంగా యుద్ధం తప్పదని కొందరికి వార్నింగ్‌ ఇచ్చారు. కత్తి చేత పట్టి ఒక రకంగా కదనరంగమే చేశారు.

ట్రంప్‌ పోకడలు చాలా చిత్రంగా ఉంటాయి. తాను చేస్తే రైటు.. ఎదుటివాళ్లు చేస్తే తప్పు అన్నధోరణిలో ఉంటుంది పెద్దన్న తీరు.
2021లో అల్లర్లకు పాల్పడిన వారిని విడిచి పెట్టి చట్టాన్ని అపహాస్యం చేశారు. 2020 నాటి ఎన్నికలను లైట్‌ తీసుకున్నారు. తనపై విమర్శలు చేసేవారిపై ప్రతీకార చర్యలు మొదలుపెట్టారు. ఒకప్పటి తన సన్నిహిత భద్రతాదారుకి సెక్యూరిటీ ఉపసంహరించి కసి తీర్చుకున్నారు. స్కూళ్లు, చర్చిల్లో అక్రమ వలసదారులను నేరుగా కస్టమ్స్ అండ్‌ ఎన్‌ ఫోర్స్మెంట్‌ ఏజెన్సీలు అరెస్టు చేసే ఆదేశాలు ఇచ్చేశారు. ఇవన్నీ కేవలం రెండు రోజుల వ్యవధిలోనే జరిగాయి. ట్రంప్‌ చాలా దూకుడు మీదున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే కొన్ని నెలలు పడుతుంది. ట్రంప్‌ అభిమానులకు ఈ చర్యలన్నీ ఉత్సాహాన్నిస్తాయి.పెద్దగా వార్తలు చూడని వారికి, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే వారికి ఈ పనులన్నీ ట్రంప్‌ ఇమేజ్‌ ను ఆకాశానికి ఎత్తేసేలా చేస్తాయి. సాధారణంగా తొలి వంద గంటలు కాదు.. తొలి వంద రోజులు కొత్త అధ్యక్షుల పనితనాన్ని లెక్కిస్తారు. కాబట్టి ట్రంప్‌ పనితీరుపై కాలం గడిస్తే కానీ అభిప్రాయం అది పాజిటివ్‌ అయినా, నెగటివ్‌ అయినా వ్యక్తం కాదు. ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాలు ఇవ్వడం గొప్పకాదు.. అందులో ఎన్ని నిజంగా ఆచరణలో ఇబ్బందులు తెస్తాయి అన్నది ఇంకా తేలలేదు. కొన్ని కోర్టు పరంగా సవాళ్లు తలెత్తే అంశాలు. వివాదాస్పద అంశాలపైనా చట్టాలు సునాయాసంగా చేసి ఆమోదం పొందగలిగితేనే ఈ నిర్ణయాలకు విలువ. తాను తీసుకున్ననిర్ణయాలను అమలు చేయడం ట్రంప్‌ ముందున్న అతిపెద్ద సవాల్.

టాప్‌ రిపబ్లికన్ లీడర్లతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. తాను తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన చట్టాలన్నింటినీ ఒకే సింగిల్‌ బిల్లు రూపంలో సభామోదం కోసం ప్రవేశపెడతారా లేక రెండు, మూడు బిల్లుల రూపంలో పెడతారా అన్నది చూడాలి. సభలో ఆయనకున్న తక్కువ మెజారిటీతో ఇవన్నీ సులభంగా గట్టెక్కే నిర్ణయాలయితే కావు.
అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడు దూకుడు నిర్ణయాలు తీసుకున్నా.. ఈసారి తొలిసారి లాగా తొందర పాటు నిర్ణయాలు, తలతిక్క నిర్ణయాలు ఉండవన్న సంకేతాలు అందుతున్నాయి. దీనికి తోడు వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆప్‌ స్టాప్‌ సుసీ వేల్స్ ఆయన మూడ్స్ ని, కదలికలను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి కాబట్టి ఆయనను బాగా నియత్రించగల సమర్ధురాలు.పైగా గతంలోకంటే ఇప్పుడు ఆయన కాస్త తెలివిగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిపిస్తోంది.

ఇన్‌ ఫ్లేషన్ కి ఇమ్మిగ్రేషన్ కి లింకు?

ధరల పెరుగుదలపై అందరూ చేస్తున్న కామెంట్లను ట్రంప్‌ తోసిపుచ్చారు.అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి దొంగగా చొరబడుతున్నవారు, మనదేశంలో తిష్ట వేసుకున్న అక్రమ వలసదారులకు ధరల పెరుగుదల ఒక్కటే కనిపిస్తుంది. ధరల పెరుగుదల నిజమే కానీ ఎన్ని సార్లని అనుకుంటాం అలా.. అక్రమ వలస దారులను తరిమి కొడితే కానీ ధరలు తగ్గుముఖం పట్టవని ట్రంప్‌ కామెంట్‌ చేశారు. ఆయన ఏం చేసినా, ఏ చర్యలు తీసుకున్నా వాటన్నింటి వెనకా అక్రమ వలస దారులను తరిమి కొట్టడమే ప్రధాన ఎజెండా గా కనిపిస్తుంది. ఏకంగా స్కూళ్లు, చర్చిలనుంచి కూడా అక్రమ వలసదారులను నిర్బంధించేందుకు కస్టమ్స్ అండ్ ఎన్‌ ఫోర్స్ మెంట్ బలగాలకు ఫుల్ పవర్స్ఇచ్చారంటేనే ట్రంప్‌ ఎంత సీరియస్ గా దీనిని తీసుకుంటున్నారన్నది మనం గమనించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి (నేషనల్‌ ఎమర్జెన్సీ)ని ప్రకటించి ఆర్మీని సరిహద్దులకు మళ్లించారు. మెక్సికో సరిహద్దుని మూసేసి అక్రమ వలసలను నిరోధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతేకాదు ఇమ్మిగ్రేషన్‌ పాలసీని కఠినతరం చేసేసి వలసవాదులు చట్ట పరంగా దేశంలోకి అడుగుపెట్టే ప్రక్రియను సంక్లిష్టం చేసేశారు. దేశంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడమే తన అజెండా అయితే అందులో ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇమ్మిగ్రేషన్ విధానం కఠినతరం చేయడం ఆయన క్రేజ్ ను పెంచేదే అదే టైమ్ లో ధరల పెరుగుదలను,ఇళ్ల అద్దెలను తగ్గించకపోతే మాత్రం ఆయన చాలా సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది.

ట్రంప్‌ కొరివితో తల గోక్కున్నారా?

మళ్లీ ట్రంప్‌ గెలిస్తే గతంలో తన రాజకీయ మనుగడకి గతంలో అన్యాయం జరిగిందన్న అపోహతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారేమోనన్న భయం ఆయన ప్రత్యర్ధులను వెంటాడుతోంది. దేశాన్ని ఉద్ధరించడానికి ట్రంప్‌ చాలా దూకుడు మీదే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఆ నిర్ణయాలకు చట్టబద్ధత ఉందో లేదో చూసుకోవడం లేదు. బర్త్ రైట్‌ సిటిజన్‌ షిప్ ను రద్దు చేసారు. ఇప్పుడు అమెరికాలో పుట్టినంత మాత్రాన అక్కడ పౌరసత్వం రాదు. తల్లి దండ్రుల్లో ఏ ఒక్కరైనా అమెరికన్ పౌరులయి ఉండాలి. వారికి అక్కడ స్థిర నివాసం ఉండాలి. ఈ కొత్త విధానంతో భారతీయులకు పెద్ద ఎదురు దెబ్బ. ఈ రూల్స్ ప్రకారం అమెరికాలో ఉంటున్న ప్రవాసీయులంతా తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. వీరందరినీ వెనక్కు పంపేస్తారా? లేక చట్టపరంగా ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అన్నిటికీ ఇమ్మిగ్రేషనే మూలకారణమని ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేయాలన్న తపన మంచిదే కావచ్చు..కానీ అది రాజ్యాంగానికి,చట్టాలకు లోబడి జరగాలన్నది ఆయన మర్చిపోతున్నారు.

అమెరికాలోకి ఇప్పుడు అడుగు పెట్టాలంటే కఠినమైన ఇమ్మిగ్రేషన్ రూల్స్ పాటించాల్సి ఉంటుందని చెప్పారు. కానీ అది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 కి శుద్ధ వ్యతిరేకమన్న మాటను మర్చిపోయారా లేక ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాన్ని రెచ్చగొట్టారా అన్నది విశ్లేషకులకు అంతు చిక్కడం లేదు.ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న దూకుడుకు కోర్టు పరంగా ఎన్నో సవాళ్లు ఎదురు కావడం ఖాయం. పైగా ఆయన ప్రతిపాదిస్తున్న కొత్త విధానంతో హెచ్ వన్ బీ వీసా రావాలన్నా.. ఎల్‌ వన్ వీసా రావాలన్నా చాలా చాలా కష్టం. దరఖాస్తు దారులు క్యూ పద్ధతిని పాటించాలి. ఇప్పటికే కుప్పలుగా ఉన్న దరఖాస్తులను పరిష్కరించాకే కొత్త వారికి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 30 ఏళ్ల పాటూ ఎదురు చూడాల్సి ఉంటుంది. సగటు ప్రపంచ పౌరులు అమెరికాలో ఉండేందుకు ఆశపడేది అక్కడున్న ఉద్యోగాలు, వాతావరణం.. మరిప్పుడు వీసా రూల్స్ కఠినం చేస్తే ఇక ఆదేశం వైపు చూసేదెవరు? పైగా అది అమెరికా బ్రాండ్ కు కూడా దెబ్బే. 2020నాటి అల్లర్లకు పాల్పడిన వారికి వెయ్యి మందికి క్షమాభిక్ష పెట్టేసిన ట్రంప్ బైడన్‌ దిగపోతూ కొందరికి క్షమాభిక్ష పెట్టడాన్ని మాత్రం తప్పుబడుతున్నారు.
సిల్క్ రోడ్‌ అనే డార్క్ వెబ్‌ సైట్‌ ఫౌండర్‌ రాస్ విలియమ్‌ ఉల్ బ్రిచ్‌ కు క్షమాభిక్ష పెట్టడం కూడా అలాంటిదే.

అన్నీ ట్రంప్‌ మార్క్ డీల్సే

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకాలని ఎన్నికలకు ముందునుంచీ ట్రంప్‌ సూచిస్తూ వచ్చారు. అధ్యక్ష పీఠం ఎక్కకుండానే వారికి లేఖలు, మౌఖిక సందేశాలు పంపారు. ఎట్టకేలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్ స్కీ చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అయినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ దారికి రాకపోవడంతో రష్యామీద ఆంక్షలు జారీ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో వారిద్దరిని ఒక టేబుల్‌ పై చర్చలకు కూర్చోబెట్టేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తారని అనిపిస్తోంది.చైనాపై విధించిన టారిఫ్‌ లు తాత్కాలికంగా నిలిపివేసినా… బీజింగ్‌ సందర్శనకన్నా ముందు దీన్నొక చిన్నపాటి వార్నింగ్‌ లా ఇచ్చారు.అలాగే యూరోపియన్ యూనియన్ పైనా ట్రేడ్‌ వార్‌ డిక్లేర్ చేసేందుకు రెడీగా ఉన్నారు. టిక్ టాక్ యాప్‌ ను అమ్మాలని చైనాను ప్రేరేపిస్తున్నారు. టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎలన్‌ మస్క్ తో బేధాభిప్రాయాలు పొడసూపినా చైనా యాప్ ను మస్క్ ఓన్‌ చేసుకోదలిస్తే చైనాతో సంప్రదింపులకు తాను రెడీ అని కూడా ట్రంప్ ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com