22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

సైఫ్‌ మీద దాడా? అంతా నాటకం

నోరు పారేసుకున్న మహారాష్ట్ర బీజేపి మంత్రి
సైఫ్‌ ని డస్ట్ బిన్‌ తో పోలుస్తూ కామెంట్లు
రాజకీయ రంగు పులుముకుంటున్నసైఫ్‌ ఉదంతం
ముస్లింలపై దాడి జరిగితే పరిగెత్తుకొస్తారు.. అదే హిందువుపై జరిగితే?
ఎన్సీపీ నేతలపై నోరు పారేసుకున్న మంత్రి
వత్తాసు పలికిన సంజయ్ నిరుపమ్‌

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ ఆలీఖాన్‌ ఇంట దొంగతనం చేయబోయి ఆగంతకుడు దాడి చేసిన వైనం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆగంతకుడి దాడిలో ఆరు కత్తి పోట్లకు బలై రెండు సర్జరీలు చేయించుకుని వారం విరామం తర్వాత ఇంటికి వెళ్లిన సైఫ్‌ ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నాడు. విజిటర్స్ ఎవరినీ కలవవద్దనీ, ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదముందని వైద్యులు చెప్పడంతో సైఫ్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే సైఫ్‌ ఇంట దొంగతనానికి, దాడికి ప్రయత్నించిన ఆగంతకుడు బంగ్లాదేశీ అక్రమ వలస దారుడని తేలడంతో బీజేపి విమర్శల పదును పెంచింది. సైఫ్‌ ఆలీఖాన్‌ పై అసలు నిజంగా దాడి జరిగిందా లేక నాటకాలు ఆడుతున్నాడా అని సందేహాలు వ్యక్తం చేసింది.మహారాష్ట్ర పోర్టు మంత్రి నితేష్ రాణే సైఫ్‌ పై అసలు దాడే జరగలేదని అంటున్నారు. సైఫ్‌ నడుస్తూనే డాన్సులు చేసే డస్ట్ బిన్‌ అని తీవ్ర విమర్శలు చేశారాయన.
బంగ్లాదేశీలు ముంబైలో ఏం చేస్తున్నారో చూడండి.. ఏకంగా సైఫ్‌ ఇంట్లోకే వెళ్లారు.గతంలో వీళ్లంతా ట్రాఫిక్‌ జంక్షన్లు, కూడళ్ల దగ్గర ఉండేవారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకే చొరబడుతున్నారు. బహుశా ఆ సైఫ్‌ ను తీసుకు పోడానికి వచ్చాడేమో. తీసుకుపోనీ.. చెత్త ఇళ్లలో ఉండకూడదు అంటూ అత్యంత ఘాటైన విమర్శలు చేశారు. సైఫ్‌ ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్నప్పుడు చూశా.. అతడు నడుస్తున్నట్లు లేదు.. డాన్సు చేస్తున్నట్లు ఉంది అసలు నిజంగా కత్తిపోట్లు ఉన్నాయా.. అంతా నాటకమా అన్న డౌట్‌ వస్తోంది అన్నారు నితేష్‌ రాణే. పనిలో పనిగా ఎన్సీపీ నేతలను కూడా తిట్టి పోశారు. ఈ ఖాన్‌ ల త్రయానికి ఏం చిన్నది జరిగినా చాలు.. వెంటనే బయల్దేరతారు.. పరామర్శలు.. చింతించడాలు..అంటూ ఎన్సీపీ నేతలు జితేంద్ర అవధ్, సుప్రియా సూలే లను ఏకి పారేశారు.వీళ్లకి ముస్లింలకి ఏం జరిగినా కంగారు వచ్చేస్తుంది. హిందూ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్ పుత్‌ ని చిత్ర హింసలు పెడితే ఒక్కరు మాట్లాడలేదు అంటూ జితేంద్ర అవధ్, సుప్రియా సూలేలను దెప్పి పొడిచారు. ఎవరైనా హిందూ నటుడిపై వారు స్పందించడం ఎప్పుడైనా చూశారా అని ఎదురు ప్రశ్నించారు.

అజిత్‌ పవార్‌ స్పందన
మంత్రి నితేష్‌ రాణే కామెంట్లపై డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ స్పందించారు. ఆయన మాటలు ఒక్క ముక్క కూడా నాకు అర్ధం కాలేదు. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే కేంద్ర హోం శాఖకు చెబితే సరి..వారు ముంబై పోలీసులను, మహారాష్ట్ర సీఎంను ఆదేశిస్తారన్నారు. సైఫ్‌ ఇంట దాడి చేసిన ఆగంతకుడు పోలీసులకు చిక్కాడు. విచారణ జరుగుతోంది. అందరికీ ముంబై అంటే ఒక క్రేజ్..అతడూ అంతే.. వచ్చాడు ముంబై చూశాడు. తిరిగి వెళ్లడానికి డబ్బులు లేవు. అందుకే దొంగ తనం ప్రయత్నం చేసి పట్టుబడ్డాడు. జరిగిందది. సైఫ్‌ ఆస్పత్రినుంచి బయటకు వచ్చినప్పుడు చూస్తే అసలు అతడిపై దాడి జరిగిందా అన్న సందేహం కలుగుతుంది.కానీ అతడిపై దాడి జరిగిన మాట వాస్తవం అన్నారు అజిత్‌ పవార్‌.
ఇక మంత్రి నితేష్ రాణా కు మద్దతుగా ఒకప్పటి కాంగ్రెస్ నేత,ప్రస్తుతం శివసేన ఏక్ నాథ్‌ షిండే వర్గానికి చెందిన సంజయ్‌ నిరుపమ్‌ కూడా కామెంట్‌ చేశారు. సైఫ్‌ పై అసలు దాడి జరిగినట్లే లేదని,అతని నడక తీరు చూస్తుంటే గత వారం అతనిపై ఏ దాడి జరగలేదని అనిపిస్తోందని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com