వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి ఉత్తర ద్వార సర్వదర్శన టోకెన్ల పంపిణీ సందర్భంగా తిరుపతి బైరాగిపట్టెడ వద్ద జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. జనవరి 8వ తేదీన జరిగిన ఈ సంఘనటపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియరీ విచారణకు ఆదేశించింది. ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎం.సత్యనారాయణమూర్తి నేతృత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలలోగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ జరిపేందుకు అన్ని రకాల అధికారాలను కమీషన్ ఇస్తున్నట్లు కూడా జీవోలో పొందుపరిచారు.