22.6 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

టిక్ టాక్ బంద్.. ట్రంప్‌ ఏం చేస్తారో?

You Can’t use Tik Tok for now… ప్రస్తుతం అమెరికాలో టిక్ టాక్ ఓపెన్ చేస్తే కనిపించే మెసేజ్ ఇది. అమెరికాలో చాలా పాపులర్ అయిన ఈ యాప్‌ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో కనిపించడం లేదు. దీంతో తన సేవలను అమెరికాలో ముగించినట్టు తేలిపోతుంది. టిక్ టాక్‌కు అమెరికాలో 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

అమెరికాలో టిక్ టాక్‌ను నిషేధించేందుకు ఇప్పటికే ఓ చట్టం తీసుకొచ్చింది ప్రస్తుత బైడెన్ సర్కార్. జనవరి 19 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. కానీ దీనికి ఒక రోజు ముందే ఈ యాప్‌ సేవలను మూసేసింది ఆ సంస్థ. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఈ యాప్ ఫ్యూచర్ ఉందని చెప్పాలి.

2017లో తన సేవలను ప్రారంభించింది టిక్ టాక్. ఆ తర్వాత భారత్‌ సహా అనేక దేశాలు నిషేధించాయి. కానీ అమెరికాలో మాత్రం తన సేవలను కొనసాగిస్తూనే వచ్చింది. అయితే అమెరికా ప్రభుత్వ పెద్దలు ఓ కండిషన్‌ను పెట్టారు. ఈ సంస్థ యాజమాన్యం చైనాకు చెందినవారు. సో.. ఈ యాప్‌ చైనా యాజమాన్యాన్ని వదులుకొవాలని కండిషన్ పెట్టింది. కానీ టిక్ టాక్ మాతృసంస్థ బైట్‌ డ్యాన్స్‌ పట్టించుకోలేదు. దీంతో జనవరి 19 వరకు డెడ్‌లైన్ పెట్టింది. కానీ ఇంతలోనే తన సేవలను ముగించేసింది.

టిక్‌టాక్‌ కోసం తీసుకొచ్చిన చట్టంలో కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. బైట్ డ్యాన్స్‌ అమెరికాకు అమోదయోగ్యమైన కంపెనీకి విక్రయించాలి. దీని కోసం 9 నెలల సమయం ఇచ్చారు. అయితే ఈ సమయాన్ని పొడిగించే అవకాశం అధ్యక్షుడికి ఉంటుంది. ఇప్పుడీదే పాయింట్‌పై ఆ కంపెనీ భవితవ్యం ఆధారపడి ఉంది. ట్రంప్‌ ఇప్పటికే చైనాపై కఠిన ఆంక్షలు విధిస్తానన్నారు. కానీ ఈ టిక్ టాక్ విషయంలో మాత్రం ఆయన మరో 90 రోజుల పాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు చర్చలు జరిపి విక్రయించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com