26.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

సింగపూర్‌ పర్యావరణ మంత్రితో సీయం రేవంత్‌ బృందం భేటీ

రెండు రోజులుగా సింగపూర్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృదం శనివారం సింగపూర్‌ సుస్ధిరత, పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్‌ ఫూ హై యెన్‌తో సమావేశం అయ్యారు. సింగపూర్‌ దేశంతో పలు రంగాల్లో తెలంగాణ రాష్ట్ర భాగస్వమ్యం కోసం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం వారితో విస్త్రత  చర్చలు జరిపారు. తెలంగాణలో పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం తదితర అంశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ఉన్న సుస్ధిర వాతారణాన్నిఅధికారులతో పాటుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సింగపూర్‌ మంత్రులకు వివరించారు. సీయం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివరించిన వివరలను ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా విన్న సింగపూర్‌ పర్యావరణ శాఖ మంత్రి తెలంగాణ బృందం ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధరంగాల్లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రతినిధి బృదం చేసిన ఆహ్వానాన్ని సింగపూర్‌ ప్రభుత్వం పరిశీలిస్తుందని గ్రేస్‌ యెన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హామీ ఇచ్చారు. ప్రధానంగా నెట్‌ జీరో ప్యూచర్‌ సిటీ, రివర్‌ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌, నీటి నిర్వహణల పట్ల అసక్తి వెలిబుచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సుస్ధిర ప్రణాళికలను ఆమె అభినందించారు. తెలంగాణ, సింగపూర్‌ కలసి నిర్వహించగలిగే ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించడానికి, పలు ప్రాజెక్టులకు భూ లభ్యత, ప్రాంతాల పరిశీలన తదితర వ్యవహారలు పరిశీలించడానికి, అధ్యయనం చెయ్యడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com