వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. మొత్తం రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ శుక్రవారం ప్రకటించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇది పునరుజ్జీవం కల్పిస్తుందని భావిస్తున్నారు.
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొదట రూ. 17వేల కోట్లన్న ప్రచారం జరిగింది. తర్వాత రూ. 10330 కోట్లు అని చెప్పుకున్నారు. అయితే అధికారికంగా 11,440 కోట్ల రూపాయలను కేంద్రం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ కింద ప్రకటించింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు గాను ప్రధాని మోడీకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. నాడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చొరవతీసుకుని స్వర్గీయ వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో రూ.1600 కోట్ల రుణాలను మాఫీ చేయించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కొత్త ఊపిరి అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి కుమార స్వామికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మంత్రి నారాలోకేష్ ధన్యవాదాలు తెలిపారు.