28.7 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

హైదరాబాద్ లో బీదర్ గ్యాంగ్ హల్ చల్

కర్ణాటకలోని బీదర్ లో చోరీ చేసి ఇద్దరిని చంపిన దుండగులు… హైదరాబాద్ లో కాల్పులు జరిపి కలకలం సృష్టించారు. బీదర్ పట్టణం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సినిమా తరహాలో భారీ దోపిడీ జరిగింది. శివాజీ సర్కిల్ సమీపంలో నగరం నడిబొడ్డున ఉన్న ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద ఎటీఎం లో పెట్టడానికి వాహనంలో డబ్బులు తీసికొచ్చిన సిబ్బంది పై ద్విచక్ర వాహనం మీద మెరుపు వేగంతో వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు.

సిబ్బంది ముఖంపై కారం పొడి చల్లి వారిపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పుల్లో సిఎంసి సిబ్బంది గిరి ,వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా శివ కాశీనాథ్ అనే మరో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు 93లక్షల డబ్బు తీసుకుని పరారయ్యారు.

అలా బీదర్‌లో చోరీకి పాల్పడిన దుండగులు బైక్‌పై హైదరాబాద్‌ వచ్చారు. వారి కదలికలను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్న పోలీసులు వారంతా హైదరాబాద్‌లో ఉన్నట్టు తేల్చారు. తీరా వాళ్లు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అఫ్జల్‌ గంజ్‌లోని ఓ ట్రైవెల్స్ ఆఫీస్‌ వద్ద పోలీసులను చూసిన దుండగులు కాల్పులు జరిపారు. ట్రావెల్స్‌ కార్యాలయం మేనేజర్‌ను అడ్డం పట్టుకుని అతడిని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. అతడిపై కూడా కాల్పులు జరిపారని సమాచారం.

దుండగులు చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ ప్రాంతానికి చెందిన వారని ప్రాథమిక సమాచారం. బీదర్ లో దోచుకున్న సొమ్ముతో వయా హైదరాబాద్ వయా చత్తీస్ ఘడ్ వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. జగ్దల్ పూర్ బస్ టికెట్ల కోసం వారు అఫ్జల్ గంజ్ లో ఉండగా కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నడిబొడ్డున పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న బీదర్ గ్యాంగ్ కోసం వేట కొనసాగుతోంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కాల్పులు జరిపిన నిందితులు సరిహద్దులు దాటిపోకుండా కట్టడి చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
హైదరాబాద్ లో ఆయుధాలు అక్రమంగా అమ్మే వ్యక్తిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొని 24 గంటలు గడవక ముందే నగరం నడిబొడ్డులో కాల్పులు జరగటం పోలీసులకు సవాల్ గా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com