సింగపూర్ దేశంతో విస్తృతమైన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఏర్పరచుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సిద్దంగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌కి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలియజేశారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృదం గురువారం అర్ధరాత్రి సింగపూర్ చేరుకుంది. శుక్రవారం ఉదయం సీయం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలసి సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ప్రధానంగా మౌలిక సదుపాయలు, గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్‌మెంట్, పర్యాటకం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ పార్క్‌ల ఏర్పాటు తదితర అంశాల విషయంలో సింగపూర్ దేశంతో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో దీర్ఘకభాగస్వామ్యం కోరుకుంటోందని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకు సీయం రేవంత్‌రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మా సింగపూర్ పర్యటన ఫలప్రదంగా ప్రారంభమయ్యిందని, శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సింగపూర్ విదేశాంగశాఖా మంత్రి వివియన్ బాలకృష్ణన్‌ల సమావేశం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఉపయుక్తంగా ఉంటుందని ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.