37.4 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

సత్తా చాటుతున్న రక్షణశాఖ.. డిఫెన్స్ అప్‌డేట్స్

భారత రక్షణశాఖ దూసుకుపోతుంది. ఇప్పటికే కీలక ప్రాజెక్టులు చేపట్టిన ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ మరో ముందుడుగు వేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.

నాగ్‌ మార్క్-2 సక్సెస్..
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణశాఖను బలోపేతం చేస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ మరో మెట్టు పైకెక్కింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నాగ్ మార్క్-2 మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఫైర్ అండ్ ఫర్‌గేట్‌ రకానికి చెందిన థర్డ్ జనరేషన్ మిసైల్ ఇది. ఈ క్షిపణులు శత్రు దేశాల ట్యాంక్‌లను తునాతునకలు చేసేస్తాయి. పోఖ్రాన్‌ టెస్ట్ ఫైరింగ్ రేంజ్‌లో దీనిని పరీక్షించారు. మొత్తం మూడుసార్లు ప్రయోగిస్తే.. మూడు సార్లు టార్గెట్‌ను పక్కాగా రీచ్‌ అయినట్టు DRDO తెలిపింది. ఈ మిసైల్‌కు సంబంధించి క్యారియర్ వర్షన్‌-2ని కూడా టెస్ట్ చేశారు. ఈ పరీక్షలన్ని విజయవంతం కావడంతో ఇండియన్ ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది నాగ్‌ క్షిపణి.

నేవీలో చేరనున్న యుద్ధ నౌకలు..
రేపు ఇండియన్ నేవీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మొత్తం మూడు యుద్ధ నౌకలు సిద్ధమయ్యాయి. INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌ సబ్‌మెరైన్‌ బుధవారం నేవీలో అధికారికంగా చేరనున్నాయి. ముంబైలోని నేవీ డాక్ యార్డ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

INS సూరత్
పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ షిప్‌ను డెవలప్‌ చేశారు. ఇప్పటికే మూడు యుద్ధ నౌకలు నేవీలోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇది నాలుగో యుద్ధనౌక. ఇదే చివరిది కూడా. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్‌లలో ఒకటి. ఈ షిప్‌ తయారీ, ఉపయోగించిన టెక్నాలజీలో 75 దేశం మన దేశానికి చెందినదే. అత్యాధునిక ఆయుధ సెన్సార్‌ వ్యవస్థ దీని సొంతం. అంతేకాదు అడ్వాన్స్‌డ్ నెట్‌వర్క్ సెంట్రిక్ వ్యవస్థ కూడా ఇందులో ఉంది.

INS నీలగిరి
పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక ఇది. దీనిని ఇండియన్ నేవీ వార్ షిప్ డిసైడ్ బ్యూరో డిజైన్ చేసింది. అత్యాధునిక ఫిచర్స్‌ ఈ షిప్ సొంతం అని చెప్పాలి. శత్రువుకు చిక్కకుండా.. దాడులు చేసే సత్తా ఉన్న స్టెల్త్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఎక్కువకాలం సముద్రంపైనే ఉంటూ సర్వేలెన్స్‌ చేయగలదు. అంతేకాదు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించే నెక్ట్స్‌ జనరేషన్ యుద్ధ నౌకలకు ఇదో రోల్ మోడల్ అనే చెప్పాలి.

INS వాఘ్‌షీర్
పీ75 కింద రూపొందిస్తున్న ఆరో, చివరి సబ్‌మెరైన్ ఇది. సబ్‌ మెరైన్ తయారీలో మన దేశం రోజురోజుకి ఎంత వేగంగా ముందుకు వెళుతున్నామనే దానికి పెద్ద ఉదాహారణ ఈ సబ్‌మెరైన్. అయితే ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com