దుందుడుకు చైనా మరోసారి దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు యుద్ధ విన్యాసాల పేరుతో తైవాన్ను కవ్విస్తూ వచ్చిన చైనా ఆర్మీ ఇప్పుడు మరో ముందుడుగు వేసింది. మొత్తం 10 యుద్ద విమానాలు.. నాలుగు యుద్ధ నౌకలు తైవాన్‌కు అతీ సమీపంలోకి వచ్చాయి. దీంతో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయనే చెప్పాలి.
ఇటీవల యుద్ధ విన్యాసాల పేరుతో తైవాన్ను కవ్విస్తూ వస్తోంది చైనా. తైవాన్‌కు మద్ధతుగా ఇప్పటికే తీర జలాల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో అమెరికన్ నేవీ తిష్ట వేసి ఉంది. చైనా దాడులు చేస్తే తైవాన్‌కు మద్ధతుగా ఉండేందుకు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాయి అమెరికన్ యుద్ధ నౌకలు. అయినా వీటిని పట్టించుకోవడం లేదు చైనా.
తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ అని ఓ సరిహద్దు ఏర్పాటు చేసుకుంది. దానిని దాటి ఎవరు వచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. మంగళవారం ఉదయం కూడా ఈ జోన్లోకి ఎంట్రీ ఇచ్చాయి చైనా యుద్ధనౌకలు, విమానాలు.
అయితే చైనా వర్షన్ మాత్రం మరోలా ఉంది. అలాంటి జోన్ ఏదీ లేదని.. తైవాన్ ఎప్పటికైనా చైనాలో అంతర్భాగమనే చెబుతోంది. ఏ రోజుకైనా తైవాన్ చైనాలో కలిసి పోవాల్సిందేనని తెగేసి చెబుతోంది. అంతేకాదు ఇప్పటికే దీనికి సంబంధించి వన్ చైనా పాలసీని తీసుకొచ్చింది.
ఇప్పుడే కాదు సోమవారం కూడా ఇలానే తైవాన్లోనికి చొచ్చుకొచ్చాయి చైనా యుద్ధ విమానాలు, నౌకలు. అయితే వాటికి సరైన బదులిచ్చామని తైవాన్ ప్రకటించింది. దీనిపై చైనా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. ఎలాగైతే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఏర్పడిందో… తాము కూడా ఓ స్వతంత్ర దేశంగా ఉన్నామని.. తమకు సొంత ప్రభుత్వం, మిలటరీ, ఆర్థిక వ్యవస్థ ఉన్నాయని తైవాన్ చెబుతోంది. తమ సార్వభౌమత్వాన్ని ఎవరూ దెబ్బ తీసినా ఊరుకునేది లేదని తైవాన్ తెగేసి చెపుతోంది.