29.7 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

నెలాఖరు వరకు వైఎస్ జగన్ విదేశీ పర్యటన

మాజీ ముఖ్యమంత్రి, వై.ఎస్.ఆర్.సి.పి (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన లండన్ పయనమవుతున్నారు. ఈనెల 16వ తేదీన జగన్ చిన్న కుమార్తె వర్ష.. కాలేజీ స్నాతకోత్సవం(కాన్వకేషన్) కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళుతున్నారు. ఈ నెలాఖరు వరకు జగన్ లండన్‌లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఆస్తుల కేసులకు సంబంధించి బెయిల్‌పై ఉన్న జగన్ విదేశాలకు వెళ్లేందుకు న్యాయస్థానాల అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. కాగా అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వైఎస్ జగన్ దంపతులు ఈ రోజు బెంగళూరు నుంచి లండన్‌ బయల్దేరనున్నారు.  ఈనెల 30వ తేదీ లోగా తిరుగు పయనమవుతారని సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com