అమెరికాలో కార్చిచ్చు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో లక్షల కోట్ల ఆస్తి నష్టం.. 25 మందికిపైగా మృతికి కారణమైన ఈ కార్చిచ్చు.. ఇప్పుడు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. మృతుల సంఖ్య పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మంటలను ఆర్పేందుకు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి ఫైర్ ఫైటర్స్ తరలివచ్చి 24 గంటల పాటు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అమెరికా కార్చిచ్చు కారణంగా ఇప్పుడు ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇంటికి కూడా ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే అమెరికా కార్చిచ్చుకు కారణమేంటి? అనే దానిపై ఇప్పుడు రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు అంశాలు మాత్రం ప్రచారంలో పీక్స్‌కు చేరాయి. ఒకటి మావనతప్పిదం కాగా.. రెండోది దేవుడి కోపం. ఈ రెండు విషయాలపైనే ఇప్పుడు అమెరికాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది.
న్యూఇయర్ సందర్భంగా పేల్చిన బాణాసంచా అమెరికా కార్చిచ్చుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికన్ ఫేమస్ న్యూస్ ఏజెన్సీ వాషింగ్టన్ పోస్ట్ ఈ ప్రచారానికి అనుకూలంగా ఓ కథనం రాసింది. న్యూఇయర్ సందర్భంగా పేల్చిన బాణాసంచా కారణంగా మంటలు ప్రారంభమై ఉంటాయని.. అయితే చిన్నగా ఉన్న ఈ మంటలకు వేడి గాలులు తోడవ్వడంతో కార్చిచ్చు ప్రారంభమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దేవుడి శాపం వల్లే సంభవించిందని మరో ప్రచారం జరుగుతోంది. లాస్ ఏంజిల్స్‌లో కొన్ని రోజుల క్రితం ఓ హాలీవుడ్ ఈవెంట్ జరిగింది. అందులో పాల్గొన్న వారంతా నో గాడ్స్ లాండ్ అంటూ దేవుడిని ఎగతాళి చేసినట్టు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అప్పుడు దేవుడు లేడని అన్నారు.. దానికి దేవుడికి కోపం వచ్చి ఇప్పుడు తన ప్రకోపాన్ని చూపుతున్నాడు… అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి అమెరికా కార్చిచ్చుపై. కానీ కారణం ఏదైనా జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంది. మంటలు విస్తరిస్తూనే ఉన్నాయి.