38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

జెట్‌ స్పీడ్‌ తో పడిపోతున్న రూపాయి విలువ

రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేనంత కనిష్ట స్దాయికి చేరుకుంది. అమెరికా డాలర్‌ తో పోలిస్తే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శుక్రవారానికి భారత రూపాయి విలువ 86.04 వద్ద ముగిసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంతగా జోక్యం చేసుకున్నా రూపాయి విలువ పతనం ఆగడం లేదు. ఆమెరికా డాలర్‌ ముందు మన రూపాయి రోజు రోజుకూ బక్కచిక్కి పోతోంది. ఇంట్రాడే పరంగా చూస్తే శుక్రవారం రూపాయి మారక విలువ ముంగిపు లైఫ్‌ టైమ్‌ లోగా చెప్పవచ్చు. రూపాయి విలువ క్షీణత ఈ విధంగానే ఇక ముందు కూడా కొనసాగితే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి అనేక ఇబ్బందులు చుట్టుముడాతయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వాణిజ్యలోటు, కరెంటు ఖాతా లోటుతో పాటు ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో చదువుల కోసం తమ పిల్లలను అక్కడకి పంపిన తల్లిదండ్రులకు విపరీతమైన ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. అయితే ఎగుమతులకు మాత్రం ఈ పరిణామం మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎగుమతులు అధికంగా ఉండే ఐట, ఫార్మా పరిశ్రమలకు మాత్రం రూపాయి మారకంలో డాలర్ విలువ పెరగడం సానకూల అంశమని ఆర్థికరంగ నిపుణులు చెపుతున్నారు. డాలర్‌ తో పోల్చుకుంటే 2010లో 46.02 ఉన్న రూపాయి మారకం విలు 2025 వచ్చే సరికి 86.04 కి పడిపోయింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com