- పెట్టుబడుల స్వర్గధామంగా విశాఖ
- పారిశ్రామిక వర్గాలను ఆకర్షిస్తున్న మోదీ పర్యటన
విశాఖపట్నానికి ఒక్కసారి హైప్ క్రియేట్ అయ్యింది. ఏమీ లేకపోయినా ఏదో ఉందన్నట్టు భ్రమింపజేయడంలో చంద్రబాబు, మోదీ ఇద్దరు ఉద్ధండులే. ఈ కోవలోనే విశాఖలో అట్టహాసంగా రూ.2 లక్షల కోట్ల అభివ్రద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు.
ఇందులో ఎన్ని గ్రౌండ్ అవుతాయనే వాటిపై ఇంకా సిందిగ్ధత కొనసాగుతోంది. కొత్త రైల్వేజోన్, బల్క్ డ్రగ్ పార్క్, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రూ. 1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు ఇలా కొన్ని కంపల్సరీ గ్రౌండ్ అయ్యేలా ఉన్నాయి. మిగిలిన వాటిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ క్రమంలో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ విశాఖ రావడంతో ఒక్కసారి అందరి చూపు మళ్లీ ఇటు పడింది. మొన్న మోదీ రాకతో వచ్చిన హైప్ కి అనిల్ రాకతో మరింత పైకి వెళ్లింది. స్వయంగా ఆయన అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో భూములను పరిశీలించారు. ఈ నేపథ్యంలో 1500 ఎకరాల పరిధిలో సోలార్ ప్లేట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు అంశాన్ని రిలయన్స్ సంస్థ పరిశీలిస్తోంది.
అలాగే వెయ్యి ఎకరాల్లో బ్రాండిక్స్ అపెరల్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే, ఈ ప్రాంతంలో మహిళలకు ఉపాధి లభించే అవకాశాలున్నాయి. ఇవన్నీ మొదలు కావడంతో విశాఖ చుట్టు పక్కల పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుందని వ్యాపారవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు…ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాట్లకు చకకచ పనులు జరుగుతున్నాయి.
ఇప్పటికే బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్), ఏషియన్ పెయింట్స్, సెయింట్ గోబైన్, ల్యారస్, పెప్సీ వంటి కంపెనీలు అచ్యుతాపురం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటికి తోడు కొత్తవి కూడా వస్తే… వైజాగ్ నూతన పారిశ్రామిక వైభవంగా మారనుంది.