35 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

శ్రీవారి సేవలో ప్రముఖులు…చిత్రమాలిక

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుమలలో తెల్లవారు జామున స్వామి వారికి ఏకాంత పూజలు చేసిన తర్వాత అభిషేక సేవ నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 3.45కి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు.

ఉత్తర ద్వార దర్శనం కోసం అర్దరాత్రి వరకు భక్తులు బారులు తీరారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు, సుప్రింకోర్టు న్యాయమూర్తులు కుటుంబసమేతంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి దర్శనం చేసుకున్నారు.

తిరుమలలో ప్రముఖుల చిత్రమాలిక

సుప్రింకోర్టు జడ్జి జస్టీస్ జెకె మహేశ్వరి కుటుంబ సమేతంగా ఏడుకొండల స్వామిని దర్శించుకున్నారు.

ముంబై హైకోర్టు చీప్ జస్టీస్ అలోక్ అరాధే, కర్ణాటక హైకోర్టు మాజీ చీఫ్ జస్టీస్ దినేష్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

జస్టీస్ చమలపాటి రవి కుటుంబసమేతంగా తిరుమలకు విచ్చేశారు.

జస్టీస్ కృష్ణమోహన్ కుటుంబ సభ్యులతో కలిసి ఏడుకొండల స్వామి దర్శనం చేసుకున్నారు.

తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టీస్ వేణుగోపాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తిరుమల విచ్చేశారు.

ఏపి శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏడుకొండలస్వామి దర్శనం చేసుకున్నారు.

హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి తిరుమలలోనే ఉన్న మంత్రి… ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఐపిఎస్ అధికారి సుబ్బారాయుడు కుటుంబసమేతంగా వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు.

జస్టీస్ బివిఎన్ ఎన్ చక్రవర్తి ముక్కోటి ఏకాదశి రోజు ఏడుకొండలస్వామి దర్శనం చేసుకున్నారు.

జస్టీస్ మల్లిఖార్జున రావు కుటుంబసమేతంగా తిరుమలకు విచ్చేశారు.

జస్టీస్ శేషసాయి కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు.

జస్టీస్ దుప్పల వెంకటరమణ కుటుంబసమేతంగా విచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

జస్టీస్ కృష్ణమోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జస్టీస్ మాధవి దేవి కుటుంబసభ్యులతో కలిసి ఏడుకొండలస్వామిని దర్శించుకున్నారు.

జస్టీస్ రామకృష్ణ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసి దర్శనం చేసుకున్నారు.

జస్టీస్ సూర్యవల్లి నందన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

జస్టీస్ తర్లాడ రాజశేఖర్ తిరుమలకు విచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

జస్టీస్ టిసిడి శేఖర్ కుటుంబసమేతంగా తిరుమలలో ఏడుకొండలస్వామిని దర్శనం చేసుకున్నారు.

తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబసమేతంగా విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు.

మాజీమంత్రి,ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు.

సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి సవిత ఏడుకొండల స్వామి దర్శనం చేసుకున్నారు.

కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, మాజీ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

జనసేన సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు, కళ్యాణ్ ఎంపి శ్రీకాంత్ షిండే శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

మాజీముఖ్యమంత్రి నందమూరి ఎన్ టి రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ తిరుమల విచ్చేశారు.

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర బంధు మిత్రులతో కలిసి ఏడుకొండల స్వామి దర్శనం చేసుకున్నారు.

ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేకువ జామునే శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ఏపి శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు కుటుంబసమేతంగా ఏడుకొండల స్వామి దర్శనం చేసుకున్నారు.

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కొంజారపు రామ్మోహన్ నాయుడు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కుటుంబసభ్యులతో కలిసి కలియుగ దైవం దర్శనం చేసుకున్నారు.

తిరుపతి ఎమ్మెల్యే అరని శ్రీనివాసులు వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు.

పార్వతీపురం శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏడుకొండలస్వామి దర్శనం చేసుకున్నారు.

సినీనటుడు శ్రీనివాస్ రెడ్డి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com