25.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

ముక్కోటి ఏకాదశి… శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులు

వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఏడుకొండల స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఈ రోజు మహా విష్ణువును దర్శించుకుంటే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఏకాదశి అంటే 11. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11 ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటంటే.. శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై.. మూక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి దర్శనమివ్వడం అని నమ్ముతారు. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

హరియాణా గవర్నర్ బండారు దత్తత్రేయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.

కేంద్రవిమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీసమేతంగా ఏడుకొండల స్వామి దర్శనం చేసుకున్నారు.

ఏపి హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఏడు కొండల స్వామిని దర్శించుకున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూ.జలు చేశారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబసభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు.

మహబూబ్ నగర్ ఎంపి, బీజెపి సీనియర్ నేత డికె అరుణ కుటుంబసభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు.

మరోవైపు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబసభ్యులతో కలిసి కాణిపాకం వరసిద్ది వినాయకుని దర్శనం చేసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com