35.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

వేధింపులతో తప్పులు చేస్తున్నారు… సరిదిద్దుకోండి

ఏపీ సీయం చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపైనా, సోషల్‌ మీడియా కార్యకర్తలపైనా కేసులు పెట్టి వేధించడాన్ని ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన ఏపీ సీయం చంద్రబాబునాయుడికి ఒక బహిరంగ లేఖరాశారు. మీరు, మీ కుమారుడు రెడ్‌ బుక్‌ పేరుతో ప్రతి నిమిషం కేసులు పెట్టించే కార్యక్రమం తీసుకోవడం చాలా బాధగా ఉందని చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మీ ఆహ్వానం మేరకు 1999లో టీడీపీలో చేరినప్పుడు నేను ఎన్నడు ఇటువంటి రెడ్‌ బుక్‌ గురించి, ఎవరినీ వేధించడం గానీ, పోలీసులతో కేసులు బనాయించడం కానీ చూడలేదనే విషయాన్ని గుర్తు చేసేందుకే మీకు ఈ లేఖ రాస్తున్నట్లు ముద్రగడ వివరించారు. ఈ రాష్ట్రం ఎవరి ఎస్టేటు, ఎవరి జాగీరు కాదన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. అమావస్య తరువాత పౌర్ణమి… పౌర్ణమి తరువాత అమావస్య వస్తాయన్నది మీకు తెలియంది కాదు రేపు మా జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం… ఆయన ప్రశాంతంగా ఉన్న ఇప్పుడు మీవల్ల దెబ్బతిన్న వర్గం ఊరుకుంటుందని భావించవద్దని ఇదే జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని ముద్రగడ ఆందోళణ వ్యక్తం చేశారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి, మీరు, నేను 1978లో ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యులము అయ్యామని కానీ ఎప్పుడు ఎవరు గెలిచినా ఇప్పుడు జరుగుతున్న విధంగా వేధింపులకు పాల్పడలేదని ముద్రగడ ఆలేఖలో చంద్రబాబుకు గుర్తు చేశారు. గెలిచిన వారు ఇలా కక్ష పూరితంగా ప్రవర్తించడం భావ్యం కాదని తప్పును సరిద్దికోమని ముద్రగడ రాసిన లేఖలో చంద్రబాబుకు హితవు పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com