కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ అమలుకు చొరవ తీసుకోవాలని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. డిక్టరేషన్ పేరుమీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15000 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కొద్ది రోజులుగా రాష్ట్రంలో విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు 15000 ఇవ్వమని ప్రకటించడంపై ఏకంగా ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద “కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్” పేరుతో పోస్టర్లు అంటించారు.