25.6 C
Hyderabad
Sunday, June 28, 2026

Live Video

spot_img

కొత్త వైరస్ తో ఎలాంటి ప్రమాదం లేదు..కేంద్రఆరోగ్యశాఖ

కొత్త వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదని దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపినడ్డా భరోసా ఇచ్చారు. HMPV వైరస్ ప్పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి… కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

వైరస్ వ్యాప్తిపై కేంద్రమంత్రి సోమవారం వివరణ ఇచ్చారు. HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారన్నారు.

జెపి నడ్డా కామెంట్స్

ఇది మొదటిసారిగా 2001లో గుర్తించబడింది. ఇది చాలా సంవత్సరాల నుండి ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. HMPV గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. ఇది శీతాకాలం, వసంత ఋతువు ప్రారంభంలో అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది.

HMPV కేసులున్న చైనాతో పాటు పొరుగు దేశాలలో పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ , ICMR , నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిశితంగా పరిశీలిస్తున్నాయి. శ్వాసకోశ వైరస్‌ల నివేదికలను ICMR ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తుంది. ICMR, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ కూడా సమీక్షించబడ్డాయి.

భారతదేశంలో సాధారణ శ్వాసకోశ వైరల్ పాథోజెన్‌లలో ఏ విధమైన పెరుగుదల కనిపించలేదు. HMPV పరిస్థితిని సమీక్షించేందుకు జనవరి 4వ తేదీన డైరెక్టర్ జనరల్ ఫర్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన పర్యవేక్షణ బృందం సమావేశం జరిగింది. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు నిఘా నెట్‌వర్క్‌లు అప్రమత్తంగా ఉన్నాయి. ఆరోగ్య సవాళ్లకు తక్షణమే స్పందించడానికి దేశం సిద్ధంగా ఉంది. HMPV వైరస్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com