31.4 C
Hyderabad
Wednesday, June 17, 2026

Live Video

spot_img

హిందువులు దీపాలు వెలిగించాలి కానీ ఆర్పకూడదు – గణపతి సచ్చిదానంద స్వామి

హిందువులు దీపాలు వెలిగించాలి కానీ కేకులు కట్‌ చేస్తూ దీపాలు ఆర్పకూడదని మైసూరు దత్త పీఠాధిపతి శ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి హితవు పలికారు. కేసరపల్లిలో జరిగిన హైందవ శంఖారావంలో స్వామీజీ మాట్లాడుతూ మన సనాతన హిందూ సంస్కృతికి 5వేల 12 వందల సంవత్సరాల చరిత్ర ఉందని తెలిపారు. హిందూ దేశంలో మనమంతా పుట్టామంటే మనందరికీ ఎంతో భాగ్యం ఉన్నట్లని అన్నారు. భవంతుడు తన అవతారాల కోసం ఈ భారత భూమిని ఎన్నుకున్నాడని ఇది మనందరి అదృష్టమన్నారు. మన దేశంలో ఎన్నో మహిమలు గల దేవాలయాలు ఉన్నాయని వాటిని రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. హిందువులు అందరూ నొసట ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలని అది మన సాంప్రదయామని గణపతి సచ్చిదానంద స్వామి పిలుపునిచ్చారు. మన పిలుపు దిగంతాలకు వెళ్ళాలని, మన ప్రార్ధన భగవంతుడికి చేరాలని స్వామీజీ అభిలషించారు. ఈరోజు హైందవ శంఖారావ ప్రాంగణంలో ధ్వనించిన ధ్వని నలభై సంవత్సరాల పాటు ప్రతిధ్వనిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామి ఆకాంక్ష వెలిబుచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com