29.7 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

మన దేశంలోనూ HMPV వైరస్‌ ఎంట్రీ

  • బెంగళూరులో ఇద్దరు చిన్నారులలో వైరస్
  • అలెర్టయిన కేంద్ర ఆరోగ్య శాఖ
  • వైరస్‌ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు నిఘా, పర్యవేక్షణ
  • దేశవ్యాప్తంగా సన్నద్ధంగా ఉండాలని పిలుపు
  • చిన్నారులు, బలహీనులకే ముప్పు అధికం

చైనాను ఇబ్బంది పెడుతున్న HMPV వైరస్‌ మన దేశంలోకి కూడా అడుగుపెట్టింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులలో ఈ వైరస్‌ ను గుర్తించారు. మూడు నెలలు,8నెలల వయసున్న చిన్నారులలో దీనిని గుర్తించారు.కాగా మూడునెలల వయసున్న శిశువుకు వైద్యం చేసి పంపారు.8 నెలలశిశువుకి ఇంకా ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ కొనసాగుతోంది.మన దేశంలో HMPV వైరస్ కనపడటం ఇదే తొలిసారి. అయితే బాధిత కుటుంబాలు ఇటీవల కాలంలో ఎలాంటి విదేశీ పర్యటనలకుగానీ,దేశీయ పర్యటనలకుగానీ వెళ్లలేదు. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నశ్వాసకోశ వ్యాధులపై ICMR చేస్తున్న అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.ప్రపంచ వ్యాప్తంగా HMPV వైరస్ భారత్‌ సహా అనేక దేశాలలో విస్తరించింది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది.

మొదట జలుబు, దగ్గు, తేలికపాటి జ్వరంతో కనిపించే ఈ లక్షణాలు రోగ నిరోధక వ్యవస్థ సరిగా లేని వారిలో ఇతర శ్వాస కోశ సమస్యలకు దారి తీస్తుంది.ఒక్కోసారి ఊపిరి అందక ఇబ్బందులు పడతారు. ఆపై అరుదైన కేసుల్లో అది న్యుమోనియాకు దారి తీయవచ్చు.వైరస్ తీవ్రత ఎక్కువైతే ఒక్కోసారి మరణానికీ దారి తీయవచ్చు.చైనాలో ఇటీవల శ్వాసకోస వ్యాధుల ముప్పు విపరీతంగా పెరిగింది. ఈనేపధ్యంలో మన దేశంలో జాయింట్ మానిటరింగ్‌ గ్రూప్ ఏర్పాటైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ,జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం,ఐసీఎంఆర్, ఇతర ఆరోగ్యసంస్థలతో కలసి నిరంతర పర్యవేక్షణ సాగుతోంది.చైనాలో శ్వాస కోశ సంబంధిత వ్యాధుల విస్త్రుతికి తోడు ఫ్లూ,ఇన్‌ ఫ్లుయెంజా, RSV,HMPV వైరస్‌ ల వ్యాప్తి కూడా ఉథృతంగా కనిపిస్తోంది.అయితే మన దేశంలో HMPV వైరస్ వ్యాప్తి ఎక్కడా ఇప్పటి దాకా లేదు.పొరుగు దేశంలో వైరస్ వ్యాప్తి, మన దేశంలోనూ కనిపించడంతో ఈ ముప్పును ఎదుర్కొనడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉంది. అనేక చోట్ల ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రులన్నీ ఈ కేసులను ఎదుర్కొనడానికి తగిన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని, వ్యాధి సోకిన వారిని ఐసోలేట్ చేసి ట్రీట్‌ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని,అత్యవసర మందులు సిద్ధం చేసుకోవాలని కేంద్రం సూచించింది.ఫ్లూ,ఇన్‌ ఫ్లుయెంజా లాంటి ప్రత్యేక కేసులు కనపడితే వెంటనే కేంద్రాన్ని అలెర్ట్ చేయాలని తెలిపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com