31.7 C
Hyderabad
Friday, June 19, 2026

Live Video

spot_img

సేవా సంస్థలకు సంపూర్ణ సహకారం అందిస్తాం… భట్టి

  • విద్య, వైద్య రంగాల్లో ప్రజా ప్రభుత్వం విశేష కృషి
  • మహావీర్ అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన శంషాబాద్ రోడ్ లోని సిటాడెల్ కన్వెన్షన్ లో 30వ మహావీర్‌ ఇంటర్నేషనల్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక పరివర్తన కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా మహావీర్ జైన్ సంస్థ పనిచేయడం అభినందనీయం అన్నారు. చిన్నారులు, మహిళల సాధికారికత కోసం, వైద్య సహకారం అవసరమైన వారికి మహావీర్ సంస్థ ఉచితంగా సేవలు అందించడాన్ని డిప్యూటీ సీయం అభినందించారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కూడా విద్యార్థులు, మహిళలు, వైద్య రంగాల్లో విశేష కృషి చేస్తోందని వివరించారు.

మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అందులో భాగంగా మొదటి సంవత్సరం 19 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు అందించినట్లు తెలిపారు. ఇలా ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు పోతున్నట్టు తెలిపారు.

ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది 5వేల కోట్లు ఖర్చు చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామన్నారు. పది లక్షల వరకు నిరుపేదలు రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నట్టు వివరించారు.

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం మూలంగా నివాసానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ పరిస్థితులు హైదరాబాదులో తలెత్తకుండా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాదును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాదును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో భాగంగా కాలుష్య కారకమైన పరిశ్రమలను హైదరాబాద్ నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాదు నగర అభివృద్ధికి పదివేల కోట్లు బడ్జెట్లో కేటాయించాము అన్నారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కొత్త విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుందని వివరించారు. మాది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com