వైకుంఠ ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీడీడీ నిర్ణయించింది. ఈ పది రోజుల్లో దాదాపు 6 లక్షల 69 వేల మంది భక్తులకు టీటీడీ వైకుంఠద్వార దర్శనం కల్పించనుంది. ఇప్పటికే వైంకుఠద్వారా దర్శనానికి ఆన్లైన్లో టిక్కెట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. సర్వదర్శనం భక్తులకు సంబంధించి 9వ తేదీన తిరుపతిలో ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఏడాదికి పది రోజులపాటు మాత్రమే భక్తులను అనుమతించే వైకుంఠ ద్వార దర్శనం కోసం సామాన్యులే కాదు వీఐపీలు కూడా తిరుమలకు క్యూ కడతారు. గతంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు మాత్రమే భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించే టిటిడి 1953 నుంచి వైకుంఠ ద్వాదశి రోజు కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది. ఇక భక్తుల తాకిడి ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తూండడంతో 2020 నుంచి శ్రీరంగం ఆలయం తరహాలో పది రోజులు పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించే విధానాన్ని ప్రారంభించింది టీటీడీ. దీనితో గతంలో రెండు రోజుల వ్యవధిలో 1,60,000 మంది భక్తులకు మాత్రమే పరిమితమైన వైకుంఠ ద్వార దర్శన భాగ్యం …ఇప్పుడు ఏడాదికి పది రోజుల సమయంలో ఆరు నుంచి ఏడు లక్షల మంది భక్తులకు లభిస్తోంది. పది రోజులలో 186 గంటల సమయం భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉండడంతో ఆరు లక్షల 69 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాటు చేసింది టీటీడీ.
ఇప్పటికే ఆన్లైన్ విధానంలో 1,40,000 టోకెన్లను ప్రత్యేక ప్రవేశ దర్శన భక్తులకు కేటాయించగా …శ్రీవాణి దర్శన భక్తుల కోసం 19500 టికెట్లను కేటాయించింది టీటీడీ.ఇక సర్వదర్శనం భక్తులకు పది రోజులలో నాలుగు లక్షల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తుంది టీటీడీ .వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున 36వేల టోకెన్లు ద్వాదశి పర్వదినం రోజున 39 వేల టోకెన్లు జారీ చేస్తుండగా మూడవరోజు ,నాలుగు ,ఐదవ రోజులలో 45000 చొప్పున ఆరోవ రోజు 37000 చొప్పున ఏడవ రోజు 36000 చొప్పున 8వ రోజు 30 వేల చొప్పున 9 ,10 వ రోజులలో 44 వేల చొప్పున టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ .సర్వదర్శనం భక్తులకు సంబంధించి ముందుగా మూడు రోజులకు సంబంధించిన 1,20,000 టోకెన్లను 9వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలో ప్రత్యేకంగా 8 ప్రాంతాల్లో,తిరుమలలోని కౌస్తూభం వద్ద ఏర్పాటు చేసిన 91 కౌంటర్ల ద్వారా కేటాయించునుంది టీటీడీ. అటు తరువాత ఏ రోజుకు సంబంధించిన టికెట్లను ఆరోజే తిరుపతిలో శ్రీనివాసం,విష్ణునివాసం,భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆఫ్లైన్ విధానంలో కేటాయించేలా ఏర్పాట్లు చేస్తుంది.వైకుంఠ ఏకాదశి పర్వదినం శుక్రవారం ప్రారంభం అవుతుండడంతో ఆరోజు 18 గంటల 30 నిమిషాల పాటు భక్తులను దర్శనానికి అనుమతించునుంది టీటీడీ .శుక్రవారం రోజు వేకువ జామున 12 గంటలకు స్వామివారి ఆలయంలో తిరుప్పావైతో మేల్కోలుపు కార్యక్రమాన్ని నిర్వహించునున్నారు.అటు తరువాత శ్రీవారికి అభిషేక కార్యక్రమం,ఆభరణాల అలంకరణ నిర్వహించిన అనంతరం ఉదయం నాలుగున్నర గంటలకు విఐపి ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను దర్శనానికి అనుమతించునుంది టీటీడీ .సర్వదర్శనం టోకెన్ కలిగిన భక్తులను ఎనిమిది గంటల నుంచి దర్శనానికి అనుమతించునున్నారు.ఆ రోజున 60 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా టిటిడి ఏర్పాటు చేసింది .ఇక 11వ తేదీ ద్వాదశి పర్వదినం రోజున 19 గంటల 15 నిమిషాల పాటు భక్తులను దర్శనానికి అనుమతించనుంది టీటీడీ .ఆరోజు 63875 మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాటు చేస్తుంది టీటీడీ. మూడు,నాలుగు,ఐదోవ రోజుల్లో 19 గంటల 30 నిమిషాల పాటు భక్తులను దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాటు చేస్తుంది టిటిడి.ఈ మూడు రోజులు కూడా 72,000 మంది చోప్పున భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది.అటు తరువాత ఆరోవ రోజు బుధవారం 17 గంటల 30 నిమిషాల పాటు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతించునుంది టీటీడీ.ధనుర్మాస నెల ముగుస్తూ ఉండడంతో శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి సుప్రసభాత సేవను పునరుద్ధరణ చేయనున్నారు.దీనితో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉండడంతో దర్శన సమయం లో రెండు గంటల కోత పడుతున్న నేపథ్యంలో ఆరవ రోజు 64,000 మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శన భాగ్యం లభించునుంది. ఇక ఏడవ రోజు గురువారం 18 గంటల 15 నిమిషాల పాటు భక్తులను దర్శనానికి అనుమతించునున్నారు.ఆ రోజున స్వామివారికి సంబంధించి ఆభరణాల సడలింపు కార్యక్రమం ,నేత్ర దర్శన భాగ్యం, పూలంగి సేవ కార్యక్రమాలు ఉండడంతో దర్శన సమయం గంట పాటు కోతపడుతుండడంతో 63,000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించునుంది .ఎనిమిదో రోజు శుక్రవారం 15 గంటల 30 నిమిషాల పాటు భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించునున్నారు.శుక్రవారం శ్రీవారికి సుప్రభాత సేవతో పాటు అభిషేక సేవ కూడా నిర్వహిస్తూ ఉండడంతో దాదాపు నాలుగు గంటల సమయం కోతపడుతుండడంతో శుక్రవారం రోజు 57,000 మంది భక్తులకు మాత్రమే స్వామి వారి దర్శన భాగ్యం లభించునున్నది. తొమ్మిదవ రోజు శనివారం ,10వ రోజు ఆదివారం 19 గంటల 15 నిమిషాలు చొప్పున భక్తులను దర్శనానికి అనుమతించునుంది టీటీడీ. రెండు రోజులలో 71,000 చొప్పున భక్తులను దర్శనానికి అనుమతించునుంది టీటీడీ .ఇలా మొత్తం పది రోజులలో ఆరు లక్షల 69 వేల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించనుంది.