కొత్త సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే జయంతిని (జనవరి 3వ తేదీ) మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఇక అధికారికంగా నిర్వహించనున్నారు. విద్యాశాఖ ఆధ్యర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి ఏటా మహిళా ఉపాధ్యాయులను సన్మానిస్తారు.
సావిత్రిబాయి ఫూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సావిత్రీబాయి ఫూలే మహిళా విద్యకు ప్రాధాన్యమిచ్చారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని ఆర్పించారని కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు.