21 C
Hyderabad
Thursday, October 29, 2026

Live Video

spot_img

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రానికి లీకేజీ గండం

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్(Srisailam Left Bank Hydropower Station) కేంద్రానికి ప్రమాదం పొంచి ఉందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్ారు. కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్‌లో నీటి లీకేజీ అవుతోందని..డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ అవుతున్న నీరు ప్రమాదమంటున్నారు.

ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో కొరవడుతున్న పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు వస్తున్నాయి. అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్‌కు భారి నష్టం సంభవిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ఇంజనీర్లు కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోపోతే ఉపద్రవం ముంచుకొస్తుందని హెచ్చరిస్తున్నారు.

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాన్ని 24 ఏళ్ల క్రితం నిర్మించారు. లీకేజీ నీటి ధారలను అరికట్టకపోతే జోరో ఫ్లోర్‌ స్లాబ్‌ కూడా పడిపోయే ప్రమాదం ఉందని మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం తెలంగాణ పరిధిలో ఉండగా…కుడి గట్టు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com