కార్నాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనాతా పార్టీకి యువ పార్లమెంట్ సభ్యుడు తేజస్విసూర్య వివాహం నిశ్చయమయ్యింది. చెన్నైకి చెందిన ప్రముఖ శాస్త్రీయ గాయని శివశ్రీ స్కంద ప్రసాద్ ను ఆయన వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన బెంగళూరులో స్వయంగా ప్రకటించారు. వచ్చే మార్చి 24వ తేదీన పెళ్ళి ముహుర్తం ఖరారు చేసినట్లు తేజస్వి వెళ్లడించారు. శాస్త్రీయ సంగీత గాయని అయిన శివశ్రీ మద్రాస్ యూనివర్శిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ పూర్తి చేశారు. అలాగే మద్రాస్ సంస్కృత కళాశాలలో ఎంఏ సంస్కృతం చదివారు. ఇక తేజస్విసూర్య దేశంలోని పిన్నవయసు కలిగిన ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. బెంగళూరు సౌత్ లోక్ సభ స్ధానం నుంచి ఆయన రెండో సారి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందా. తన ప్రసంగాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వికి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేసి క్రియాశీల రాజకీయాల్లోకి ఆహ్వానించి 2019లో బెంగళూరు సౌత్ లోక్ సభ స్ధానం నుంచి బీజేపీ టిక్కెట్ ఇచ్చారు. తొలిసారి 2019లో లోక్ సభకు ఎన్నికైన సూర్య 2024లో కూడా బెంగళూరు సౌత్ లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేసి రెండో సారి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు.