34.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

డాకింగ్ ప్రక్రియలో విజయవంతంగా తొలి అడుగు

నిర్ణీత కక్ష్యలోకి స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు

స్పెస్ డాకింగ్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలో జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరీక్ష పరిశోధణా సంస్ధ మర కొత్త అధ్యాయానికి నాంది పలికింది. సోమవారం రాత్రి ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగంలో కేవలం 15.13 నిమిషాల్లోనే నిర్ణీత కక్ష్యలోకి పీఎస్ఎల్వీ-సీ60 చేర్చడం ద్వారా డాకింగ్ ప్రక్రియలో మరో భారత్ ముందడుగు వేసింది. వ్యోమోనౌక పీఎస్ఎల్వీ-సీ60 ద్వారా ఎస్డీఎక్స్01, ఎస్డీఎక్స్02 ఉపగ్రహాలను మన శాస్త్రజ్ఞులు విజవంతంగా నింగిలోకి పంపారు. ఈ ఉపగ్రహాలను భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం కక్ష్యలో వేరు వేరుగ తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను కొన్ని రోజుల తరువాత డాకింగ్ ప్రక్రియ ద్వారా కలుపుతారు. అది విజయవంతం అయితే రోదశిలో భారత్ అంతరిక్ష కేంద్రం నిర్మాణం శులభతరవమవుతుంది. ఇప్పటివరకూ ఈ డాకింగ్ సామరధ్యం ఉన్న దేశాలు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించిన ప్రయోగం విజయవంతం అయితే ఆదేశాల సరసన భారత్ కూడా డాకింగ్ సామర్ధ్యం ఉన్న దేశంగా నిలుస్తుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం రాత్రి 10.15 గంటలకు నింగిలోకి దూసుకు వెళ్ళిన పీఎస్ఎల్వీ-సీ60 రాకెట్ సరిగ్గా 15 నిమిషాల 10 సెకన్లకు మొదటి ఉప గ్రాహన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అలాగే 15 నిమిషాల 13 సెకన్లకు రెండో ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో విడిచిపెట్టింది. దీంతో ఇస్రో కంట్రోల్ రూమ్ లో సిబ్బంది తప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. స్పేడెక్స్ మిషన్ విజయవంతం అయ్యిందని రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్ ఇస్రో చైర్మన్ సోమనాధ్ ప్రకటించారు. చంద్రమండలానికి మన ఆస్ట్రోనాట్లను పంపి అక్కడి మట్టి భూమి మీదకు తీసుకు రావాలన్నా, రోదశిలో అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్నా దానికి డాకింగ్ టెక్నాలజీ కీలకం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com