30.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు బాగా సహకరిస్తున్నారు – పవన్ కళ్యాణ్

రేవంత్ రెడ్డి కాబట్టే హీరోని అరెస్ట్ చేయగలిగారని, తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారని అంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యా ధియేటర్ ఘటన తదనంతర పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను నిష్కర్షగా విలేకరులతో పంచుకున్నారు. పుష్ప2 ప్రీమయర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం బాధాకరమన్న పవన్ కళ్యాణ్… గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని అభిప్రాయపడ్డారు. అభిమాని మృతిచెందిన వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైందంటూ సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. అల్లుఅర్జునే కాదు..టీమ్‌ అయినా సంతాపం తెలపాల్సింది… నిర్మాతో, దర్శకుడో ఎవరో ఒకరు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి ఉంటే విషయం ఇంతవరకూ వచ్చేది కాదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని.. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సంధ్యా ధియేటర్ దుర్ఘటన విషయంలో ఎవరూ ప్రత్యక్ష కారణం కాకపోయినా యూనిట్ మొత్తం స్పందించాల్సింది. అలా చెయ్యకుండా సమస్య మొత్తం హీరో మీద వేసేసి ఆయన్ను ఒంటరిని చేసేశారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో హీరోలు సినిమా ధియేటర్లుకు వెళ్లి సినిమాలు చూసే పరిస్ధితి లేదని, అందుకే నేను సినిహాళ్ళకు వెళ్లి సినిమాలు చూడనని పవన్ కళ్యాణ్ చెప్పారు. చట్టం అనేది అందరికీ సమానమే అని అన్నారు. హీరోకి తెలియకుండానే సినిమా యూనిట్ బాధిత కుటుంబం వద్దకు వెళ్లి భరోసా ఇచ్చి ఉంటే బాగుండేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విలేఖరులతో ఇష్టాగోష్టికి ముందు డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ తో నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. విజయవాడంలో నిర్వహించనున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com