32.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

ట్రంప్ వర్సెస్ మస్క్

  • వీసా పాలసీపై సోషల్ మీడియా వార్..
  • మేక్ అమెరికన్ గ్రేట్ నినాదానికి అటు.. ఇటు..

అమెరికా కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు,బిలియనీర్ ఎలన్ మస్క్ హానీ మూన్ ముగిసిందా? ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతోందా? అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఏకపక్షంగా ట్రంప్ సైడ్ తీసుకుని తన సోషల్ మీడియా కాంపెయిన్ తో గెలిచేందుకు సాయ పడిన మస్క్ ఇప్పుడు రివర్స్ అవుతున్నారా? అమెరికా పౌరుడిని సమున్నతంగా నిలబెట్టాలన్న మేక్ అమెరికన్ గ్రేట్ అగెయిన్ నినాదం (MAGA) తో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఇప్పుడు మస్క్ కు హ్యాండ్ ఇస్తున్నారా? ఇమ్మిగ్రేషన్ పాలసీపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రభావితం చేసే ఇద్దరు ఇండియన్ సంతతి టెకీల మధ్య ఇది చిచ్చులా మారింది. ఒకరు అమెరికా సిలికాన వ్యాలీలో కీలకవ్యక్తి అయిన వివేక్ రామస్వామి.. ఆయనకు ఎలన్ మస్క్ వర్గం మద్దతు పలుకుతోంది.మరొకరు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఏఐ విభాగం చీఫ్ గా చేరిన శ్రీరామ క్రిష్ణన్. ఎన్నికలకు ముందు ఉద్యోగాల్లో అమెరికన్లకే ముందు అవకాశాలు కల్పిస్తామని, ఇమ్మిగ్రేషన్ పాలసీని కఠినతరం చేస్తామని ముమ్మరంగా ప్రచారం చేసిన ట్రంప్ గెలిచాక కూడా ఈ పాలసీపై కఠినంగానే ఉంటామని అన్నారు.కానీ ఇప్పుడు కాస్త మెత్త పడినట్లుగా ఆయన ఇంటర్వ్యూలు చెబుతున్నాయి. దాంతో ఎలన్ మస్క్ టీమ్ కి, ట్రంప్ టీమ్ కి మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం మొదలైంది.

మెరిట్ కే జై కొడుతున్న మస్క్

ఎలన్ మస్క్ కూడా అమెరికాలోకి హెచ్ వన్ బీ వీసా ద్వారానే అడుగు పెట్టారు.టెక్నాలజీకి పెట్టింది పేరైన అమెరికా ప్రపంచంలో నెంబర్ వన్ గా రాణించాలంటే టాలెంట్ హంట్ జరగాల్సిందేనని ఆయన వాదన. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెరికల్లాంటి సాఫ్ట్ వేర్ సిబ్బందిని ఎపింక చేసి రప్పించుకోవాలని మస్క్ వాదిస్తున్నారు. అప్పుడే అమెరికా టెక్నాలజీ పరంగా, ఆర్థికంగా తన పట్టును నిలబెట్టుకోగలదని ఆయన వాదిస్తున్నారు.ఇదే విషయాన్ని ఎక్స్ లో కూడా ట్వీట్ చేశారు. మస్క్ ను సమర్ధిస్తూ భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్లను ట్రంప్ మద్దతు దారులు తప్పుబడుతున్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం చేయకపోతే నిజమైన అమెరికన్లకు నష్టం జరుగుతుందని అది అమెరికన్ వర్కర్లను అవమానించడమేనని అంటున్నారు.

వివేక్ వర్సెస్ శ్రీరామ్

ఎలన్ మస్క్ టీమ్ లో ఉన్న వివేక్ రామస్వామి, ఇతర సిలికాన్ వ్యాలీ దిగ్గజాలు మెరిట్ఆధారిత ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు చేపట్టాలని పట్టు పడుతుంటే ఇందుకు విరుద్ధంగా ట్రంప్ టీమ్ లో ఉన్న శ్రీరామ్ క్రిష్ణన్ వర్గం వాదిస్తోంది. ఇమ్మిగ్రేషన్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలకిచ్చిన వాగ్దానాలనే గాలి కొదిలేసినట్లవుతుందని ఇది నమ్మక ద్రోహమేనని వారు అంటున్నారు. ట్రంప్ టీమ్ ఈమధ్యనే వెంచర్ కేపిటలిస్ట్ ,భారతీయ సంతతికి చెందిన శ్రీరామ్ క్రిష్ణన్ ను ట్రంప్ టీమ్ లో ఏఐ పాలసీ కర్త గా నియమించడంతో MAGA క్యాంప్ లో లుకలుకలు మొదలయ్యాయి. ప్రభుత్వ విధానాలకు వినియోగించే సాంకేతిక పరిజ్నానానికి ఆర్టి ఫీషియల్ఇంటెలిజెన్స్ జోడించి పాలనను కొత్త పుంతలు తొక్కించాలని ట్రంప్ ఉద్దేశం. అయితే ఏఐ విభాగం మస్క్ మద్దతు దారులకు కాకుండా ట్రంప్ మద్దతు దారులకు అప్పగించడంతో రచ్చ రాజుకుంది.దాంతో వీసా పాలసీని కఠినతరం చేయాలన్న ట్రంప్ వర్గం నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా మస్క్ వర్గం ఎండగడుతోంది.

ఇమ్మిగ్రేషన్ పాలసీపై ట్రంప్ కే క్లారిటీ లేదా?

ఈ వివాదంలోకి ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ కూడా ఎంటర్ అయ్యారు. అమెరికా ఇప్పుడు సొంత టాలెంట్ పై ద్రుష్టి పెట్టాలి.వారిపైనే పెట్టుబడులు పెట్టాలని, అమెరికన్ కల్చర్, అమెరికన్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తే తప్పులేదని అన్నారు.
ఈ యుద్ధం ఇలా సాగుతుంటే ట్రంప్ ఏం చేస్తారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీసా నిబంధనలు కఠినతరం చేస్తామని ప్రకటించింది.కానీ ఆ తర్వాత ట్రంప్ ధోరణి మారినట్లుగా కనిపిస్తోంది. అమెరికన్ యూనివర్సిటీలలోని ఫారిన్ గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్ లు ఇస్తామని ఓ పోడ్ కాస్ట్ లో అన్నారు. ఇలా గంటకో రకంగా మారుతున్న ట్రంప్ ధోరణి ఇమ్మిగ్రేషన్ పాలసీలపై ముందు ముందు ఎలా మారుతుందో అన్న భయం అందరినీ వెంటాడుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com