33.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో నితీష్ రెడ్డి సెంచరీ

ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ లో సీనియర్ ఆటగాళ్లందరూ విఫలమవుతున్న పరిస్ధితుల్లో యువ క్రికెటర్ నితీష్ కమార్ రెడ్డి అమూల్యమైన సెంచెరీ చేసి సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ కెరీర్ లో ఇది నితీష్ మొదటి సెంచరీ. టీమ్ ఇండియా తరపున ఆడుతున్న నాలుగొవ అంతర్జాతీయ మ్యాచ్ లో నితీష్ శతకం సాధించడంతో టీమ్ సభ్యులందరూ అతనని అభినందించారు. ఆసీస్ పేస్ బౌలర్ల ధాటికి టాప్ స్టార్ బ్యాట్స్ మెన్లందరూ కుప్పకూలినా నితీష్ మాత్రం సెటిల్డ్ గా ఆడి శతకం నమోదు చేశాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తో కలసి క్రీజ్ లో నిలకడగా ఆడుతూ భారత స్కోరును మూడు వందల మార్కు దాటించి జట్టు పరువు కాపాడాడు. ఎనిమిదో వికెట్ కు సుందర్ తో కలసి అత్యంత విలువైన 127 పరుగుల భాగస్వామ్యం స్కోరుకు జోడించాడు నితీష్. 8వ స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ఇప్పటి వరకూ అత్యధికంగా 87 రన్లు సాధించిన ఇండియన్ క్రికెటర్ గా అనిల్ కుంబ్లే 87 కొనసాగేవారు. ఆరికార్డును ఇప్పుడు నితీష్ రెడ్డి అధిగమించాడు. మొత్తంగా నితీష్  171 బంతులు ఆడి వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ లో సెంచరీ సాదించడం ద్వారా ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిని పిన్న వయసు భారత క్రికెటర్లలో నాలుగో వాడిగా నితీష్ రెడ్డి రికార్డులకెక్కాడు. 1948వ సంత్సరంలో అడిలైడ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అతి పిన్న వయసులో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించిన ఇండియన్ క్రికెటర్ గా దత్తు ఫడకర్ రికార్డు నెలకొల్పరు. అప్పుడు ఫడకర్ వయసు 22 సంవత్సరాల 46 రోజులు. 44 సంవత్సరాల తరువాత 1992వ సంత్సరంలో సచిన్ టెండూల్కర్ 18 సంవత్సరాల 256 రోజుల వయసులో సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించి ఫడకర్ రికార్డును బద్దలు కొట్టారు. సచిన్ తరువాత 2019లో సిడ్నీలోనే జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్ 21 సంవత్సరాల 92 రోజుల వయసులో సెంచరీ సాధించి అస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచుల్లో అతి చిన్న వయసులో సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్ గా రికార్డులకెక్కారు. మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఇప్పు నితీష్ రెడ్డి 21 సంవత్సరాల 216 రోజుల్లో ఆ ఫీట్ సాధించిన నాలుగో ఇండియన్ క్రికెటర్ గా రికార్డుల్లో నమోదయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com