మాజీప్రధాని మన్మోహన్‌సింగ్ దివంగతులు కావడంతో ఆయన గౌరవార్థం క్రికెటర్లు నల్ల బ్యాండ్‌లు ధరించి మ్యాచ్‌లో పాల్గొన్నారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాలో నాలుగో టెస్టు జరుగుతోంది. అయితే, టెస్టులో రెండోరోజు భారత ఆటగాళ్లు మ్యాచ్ ఆడాల్సిన సమయానికి మాజీ ప్రధాని మన్మోహన్ మరణించారనే వార్త తెలిసింది. దీంతో, భారత క్రికెటర్లంతా నల్లటి బ్యాండ్‌లు ధరించి స్టేడియంలోకి వచ్చారు. ఆట ముగిసేదాకా మాజీ ప్రధాని గౌరవార్థం నల్ల రిబ్బన్లు ధరించారు.