ముగ్గురి దుర్మరణం.. అనేక మందికి గాయాలు..
ఉత్తరాఖండ్ లో రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు నైనిటాల్ దగ్గర భీమ్ తాల్ రోడ్డు మలుపు తిరిగే క్రమంలో ఈ మధ్యాహ్నం లోయలో పడిపోయింది. 1500 అడుగుల లోతుకు బస్సు పడిపోవడంతో ముగ్గురు చనిపోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. భీమ్ తాల్, రాణీ బాగ్ రోడ్డులో బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు, ఇతర అధికారులు, రోప్ వే పార్టీలు క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి స్పందించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, వారికి తగిన వైద్యసేవలు అందించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
లోయలోకి పడిపోయిన బస్సు..
- Advertisement with us -