30.7 C
Hyderabad
Friday, October 23, 2026

Live Video

spot_img

మైనారిటీలందరికీ భద్రత కల్పించండి…

బంగ్లాదేశ్ కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

బంగ్లా దేశ్ లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఎట్టకేలకు అమెరికా స్పందించింది. బంగ్లాదేశ్ లో ఉన్న అందరికీ మతాలకు అతీతంగా భద్రత కల్పించాలని అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా జాతీయ భద్రతా సలహదారు జేక్ సులివాన్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కు ఫోన్ చేసి ఈ సూచన చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ వర్గాలు సుస్పష్టమైన ప్రకటన చేశాయి. అమెరికాలో బైడన్ ప్రభుత్వం మరో నెల్లాళ్లలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి పగ్గాలు అప్పగించనున్న ఈ తరుణంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.బంగ్లాదేశ్లో హిందూ ప్రార్ధనాలయాలను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతుండటం, హిందువుల భద్రత సందేహంలో పడిపోయిన వార్తల నేపధ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని మహమ్మద్ యూనస్ సేవలతో దీనినుంచి సమర్ధవంతంగా బయట పడాలని అమెరికా ఆకాంక్షించింది. బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి అవసరమైన సాయం అమెరికా చేస్తుందని కూడా జేక్ సులివాన్ హామీ ఇచ్చినట్లు ఆదేశం ప్రకటించింది.

యూనస్ హయాంలో దాడులు…

షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగాక ఆ దేశంలో అనేక హిందూ ప్రార్ధనాలయాలపై దాడులు జరిగాయి. హిందువుల ఆస్తుల ధ్వంసం, హింస కూడా ప్రజ్వరిల్లింది.దీనిపై ఈనెల 13న బైడన్ ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ ప్రస్తుత ఘటనలకు తాత్కాలిక ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అప్పట్లో హెచ్చరించింది.

అమెరికన్ డెమెక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీథనేదర్ కొన్నాళ్లక్రితం దీనిపై వైట్ హౌస్ వర్గాలు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరడంతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు స్పందించారు.బంగ్లాదేశ్ సరిహద్దుల్లొ ఉన్న కోటీ 50 లక్షలమంది హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్ వర్గాల భద్రత అత్యంత ముఖ్యమని వారి కోసం కొన్ని భద్రతా చర్యలతో కూడిన స్వయంప్రతిపత్తి జోన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అమెరికా అభిప్రాయపడింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com