ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ద్వారా గంటలోపు దర్శనం అయ్యే అంశంపై అధ్యయనం చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్ధానం చైర్మన్ బీఆర్.నాయుడు వెల్లడించారు. మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమాశం అనంతరం టీటీడీ ఈఓ శ్యామలరావుతో కలసి చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఇప్పటికే నాలుగు కంపెనీలు డెమో ఇచ్చారని తెలిపారు. అజెండాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని చెప్పిన చైర్మన్ ట్రైల్ రన్ నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ కర్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్ళాలని సీయం చంద్రబాబునాయుడు సూచించారని దీనిపై కమిటీ వేసి నివేదిక తయారు చేస్తామన్నారు. భక్తులకు ఆరోగ్య సమస్యల కారణంగా నడక మార్గంలో మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలకు ప్రణాళికలు తయారు చేయాలని బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే భక్తులకు అందించే సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకునే వ్యవస్ధను ఏర్పాటు చేయనున్నామన్నారు. తిరుమలలోని హోటల్స్ నాణ్యమైన ఆహారాన్ని అందించేలా నూతన పాలసీ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమలలో జాతీయ బ్రాండెడ్ రెస్టారెంట్లు తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అన్న ప్రసాదం విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల నియామకంతో పాటు అదనపు పోస్టుల భర్తీ చేస్తామన్నారు. క్యూలైన్లో టైలెట్ కాంపెక్ల్ నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. కంచి కామకోటి విద్యా సంస్ధకు 2కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. స్విమ్స్ కు జాతీయ హఓదా కోసం కేంద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మించాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నవీ ముంబయ్ లో 3.5 ఎకరాల్లో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మించమని వచ్చిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నమన్నారు. ముంబయ్ లో పది ఎకరాల్లో స్వామి వారి ఆలయం నిర్మిస్తున్నట్లు ఈఓ శ్యామలరావు వెల్లడించారు.
- Advertisement with us -