36.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

ఆనంది హీరోయిన్ గా గరివిడి లక్ష్మి

పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రలకు డెప్త్ ని తెచ్చే హీరోయిన్ ఆనంది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించే కొత్త, స్ఫూర్తిదాయకమైన చిత్రంలో మరొక ఇంపాక్ట్ ఫుల్ పాత్రను పోషించడానికి సిద్ధంగా వున్నారు. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్ తో రూపొందనున్న #PMF48 ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో గ్రాండ్ గా జరిగింది.

షూటింగ్ ప్రారంభానికి ముందే సినిమాను సెలబ్రేట్ చేయడం ద్వారా సినిమా ప్రమోషన్‌లలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ సరికొత్త చొరవను వెటరన్ యాక్టర్ నరేష్, ఎమ్మెల్యే పార్ధసారధి ప్రశంసించారు. ఈ చిత్రం ఉత్తర ఆంధ్రాకు చెందిన ఐకానిక్ బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి స్ఫూర్తిదాయకమైన కథను, మహిళల గుర్తింపు ఇతివృత్తాన్ని చిత్రీకరిస్తుంది.

ఎమ్మెల్యే పార్ధసారధి క్లాప్‌ కొట్టగా, ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నయాకర్ ‌కెమెరా స్విచాన్‌ చేయడంతో పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. స్క్రిప్ట్‌పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న అపారమైన విశ్వాసం ఈవెంట్ గొప్పతనంలో స్పష్టంగా కనిపించింది. జనవరి మూడో వారంలో ఆదోనిలో షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ కుమార్తె టిజి కృతి ప్రసాద్ గరివిడి లక్ష్మి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. జె.ఆదిత్య కెమెరామ్యాన్ కాగా, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com