భారతీయ చలనచిత్ర కీర్తి పతాకను అంతర్జాతీయ స్ధాయిలో ఎగురవేసిన దర్శకుడు శ్యాంబెనెగల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాదపడుతున్న ఆయన సోమవారం రాత్రి ముంబయ్ లో తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ తిరుమల గిరి ప్రాంతంలో 1934 డిసెంబర్ 14 జన్మించిన శ్యామ్ సుందర్ బెనెగల్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న ఇంటిలో నివశించేవారు. 1958వ సంవత్సరంలో ముంబయ్ వెళ్లిన శ్యామ్ బెనెగల్ వాస్తవిక దృక్పదంతో అనేక కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో స్త్రీ పాత్రను మహోన్నతంగా తిర్చిదిద్దిన శ్యామ్ బెనెగల్ కు 1976లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఎనిమిది సార్లు జాతీయ చలనచిత్రం అవార్డులు అందుకున్న ఈ పక్కా హైదరాబాదీ దర్శకుడు చివరిసారిగా దర్శకత్వం వహించిన సినిమా ముజిబ్. డాక్యుమెంటరీలు, యాడ్స్ లతో క్రియేటివ్ రంగలో ప్రయాణం ప్రారంభించిన శ్యామ్ బెనెగల్ 1974లో అంకుర్ అనే చలచిత్రానికి దర్శకత్వం వహించి సినీ జీవితాన్ని ప్రారంభించారు. శ్యామ్ బెనెగల్ సతీమణి నీరా బెనగల్ అమర్ చిత్ర కథ, ట్వింకిల్ ట్వింకిల్, కామిక్ పుస్తకాలు రాశారు. ఆయనకు కుమార్తె పియా బెనెగల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.