పంజాబ్‌లోని ఖలిస్థానీలు రెచ్చిపోయారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో పోలీసు పోస్టుపై గ్రెనేడ్‌తో దాడి చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ముగ్గురు ఖలిస్థాన్ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేశారు. పిలిభిత్ జిల్లాలో యూపీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఒకరి వద్ద నుంచి 2 ఏకే 47, రెండు పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఖలిస్థాన్ కమాండో ఫోర్స్‌కు చెందిన వారిగా గుర్తించారు. నిందితులను గుర్విందర్ సింగ్, వీరేందర్ సింగ్, జస్ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. నిందితులు ముగ్గురూ గురుదాస్‌పూర్ వాసులు.
డిసెంబర్ 21న కలానౌర్ సబ్ డివిజన్‌లో ఉన్న ఓ పోలీస్ పోస్ట్‌పై దాడి చేశారు ఖలిస్థానీ ఉగ్రవాదులు. ఈ దాడితో మృతి చెందిన ఉగ్రవాదులకు సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఖలిస్థానీలు నేపాల్ మీదుగా దేశానికి చేరుకున్నారని సమాచారం.
పంజాబ్‌లో ఈ మధ్య కాలంలో వరుసగా పోలీస్ ఔట్ పోస్టులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పాలి. ఇటీవలే ఈ పోస్టులను పోలీసులు ఖాళీ చేశారు. సిబ్బంది కొరత కారణంగా వీటిని ఖాళీ చేశారు.