36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్లసముద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. వీరు అమరాపురం మండలం  కేయన్‌ పల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 13 మంది టెంపో ట్రావెలర్లో తిరుపతి వెంకన్నస్వామి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న సమయంలో బుళ్ళసముద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రహదారిపై ఆగిఉన్న లారీని  టెంపో ట్రావెల్ వేగంగా ఢీకొనడంతో వాహనం నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో రత్నమ్మ, మనోజ్,  అధర్వ, ప్రేమ కుమారి  అనే నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.‌ మిగతా వారందరూ మడకశిర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com