అమెజాన్ ప్రైమ్.. ఇప్పుడు దాదాపు ప్రతీ ఇంట్లోకీ వచ్చేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్. ఓటీటీ బెనిఫిట్స్‌తో పాటు.. షాపింగ్ చేసుకునే ప్రయోజనాలు, షాపింగ్‌లోనూ ఆఫర్లు ఉండటంతో చాలామంది ప్రైమ్‌కు అడిక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా.. ప్రైమ్ వినియోగించుకోవాలనుకునే యూజర్లకోసం పలు ప్లాన్‌లు ఉన్నాయి. ఎవరి అవసరానికి తగినట్లు ప్లాన్‌లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే, తన ప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాక్ ఇచ్చింది. ఒక్క అకౌంట్‌పై వినియోగించే డివైజ్‌లు వాడుకునే సంఖ్యలో పరిమితి విధించింది. ఈమేరకు సవరణలు చేసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లు ప్రస్తుతం ఒకేసారి ఐదు డివైజ్‌లను వాడుకునే అవకాశం ఉంది. ఏ డివైజ్ అనేది సంబంధం లేకుండా మొబైల్ గానీ, టెలివిజన్లలో గానీ, ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్లలో గానీ వీడియోలు చూడొచ్చు. అయితే, తాజాగా అమెజాన్ ఈ డివైజ్‌లలో వినియోగంపై పరిమితి విధించింది. ఉపయోగించుకునే డివైజ్‌ల సంఖ్యలో మార్పు చేయకుండా.. టీవీల సంఖ్యపై పరిమితి విధించింది అమెజాన్. ఏకకాలంలో రెండు కంటే ఎక్కువ టెలివిజన్లలో అమెజాన్ ప్రైమ్ వీడియోను చూడాల్సి వస్తే.. మరో కొత్త కనెక్షన్ తీసుకోవాలని సూచించింది. వచ్చే జనవరి నుంచి ఈ మార్పు అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు యూజర్లకు అమెజాన్ ఇ-మెయిల్స్ పంపిస్తోంది. సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజ్‌లను మేనేజ్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఇప్పుడున్న ప్లాన్‌ల ప్రకారం అమెజాన్ యాన్యువల్ మెంబర్‌షిప్ రూ.1499. మూడు నెలలకైతే రూ.599, నెలవారీ చార్జీలైతే రూ.299 చెల్లించాలి. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అడ్వర్‌టైజ్‌మెంట్లు లేకుండా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడొచ్చు. అయితే, ఇందులో అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ తీసుకుంటే.. అడ్వర్‌టైజ్‌మెంట్లతో పై సదుపాయాలన్నీ పొందవచ్చు. ఇక, వీడియో స్ట్రీమింగ్తో సంబంధం లేకుండా షాపింగ్ ప్రయోజనాలే కావాలనుకునేవాళ్లు.. ఏడాదికి రూ.399తో షాపింగ్ ఎడిషన్ ప్రైమ్ మెంబర్ షిప్ కూడా తీసుకోవచ్చు.