ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ యాక్షన్ షురూ చేసింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు.. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌పైనా కేసుపెట్టింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌ను, ఏ2గా అరవింద్‌కుమార్‌ను, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని చేర్చింది.
ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఇప్పటికే కేసు నమోదయ్యింది. అడ్డగోలుగా విదేశీ కంపెనీకి ప్రభుత్వ సొమ్ము ట్రాన్స్ఫర్ చేశారని అభియోగాలు వచ్చాయి. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం అనుమతి కూడా లేకుండా కోట్లాది రూపాయలు నోటిమాటతో విదేశీ కంపెనీకి చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలే కాదు.. విచారణలో ఆధారాలు కూడా దొరికాయి. అయితే, అప్పుడు ఈ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసిన, ఆ వ్యవహారాన్ని పర్యవేక్షించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ను ప్రశ్నించింది. అయితే, అందులో తన తప్పేమీ లేదని అప్పటి ప్రభుత్వంలో కీలక మంత్రి కేటీఆర్ ఆదేశంతోనే తాను విదేశీ కంపెనీకి రూ.70 కోట్ల రూపాయలు చెల్లించానని సమాధానం ఇచ్చారు. దీంతో, కేసు వ్యవహారం కేటీఆర్వైపునకు మళ్లింది. అయితే, కేటీఆర్ మాజీ మంత్రి కావడం, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో విచారణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. గవర్నర్ అనుమతి తీసుకుంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతించడంతో ప్రభుత్వం ఆ అంశాన్ని కేబినెట్లోకూడా చర్చించి.. సీఎస్ ద్వారా గవర్నర్ ఆమోద పత్రాన్ని ఏసీబీకి పంపించింది. దీంతో, ఏసీబీ యాక్టివ్‌గా రంగంలోకి దిగింది. కేటీఆర్‌పై కేసు నమోదుచేసింది.
కేటీఆర్‌పై ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగం మేరకు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 13(1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసులు పెట్టారు. మరోవైపు.. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ పలువురు కీలక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారించేందుకు ఏసీబీ డీజీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.