37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

గబ్బాలో కథ కంచికేనా?

బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో పీకల్లోతూ కష్టాల్లో ఉండి టీమిండియా. గబ్బాలో గబ్బర్‌ సింగ్‌లా రెచ్చిపోతారనుకుంటే మనవాళ్లూ బౌలింగ్‌లోనూ.. బ్యాటింగ్‌లోనూ తేలిపోయారు. అయితే వర్షం దోబూచూలాడుతుండటంతో ఎక్కువగా కొనసాగడం లేదు మ్యాచ్. మూడోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి కేవలం 51 ప‌రుగులు చేసింది.

గబ్బా పిచ్‌పై ఆసీస్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోతే మనవాళ్లు మాత్రం తేలిపోయారు. ఆసీస్ బౌల‌ర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. భార‌త జ‌ట్టు 44 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోవడం ఓ షాక్ అనే చెప్పాలి. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మ‌న్‌ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిష‌భ్ పంత్ (9) ఇలా అంద‌రూ సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ బాట పట్టారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు ప‌డ‌గొట్టగా.. క‌మిన్స్‌, హేజిల్‌వుడ్ చెరో వికెట్ తీశారు. దీంతో వార్ మరోసారి వన్ సైడ్ అన్నట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాముల్, రోహిత్ శర్మ ఉన్నారు. ఇండియా ఏకంగా 394 రన్స్ వెనకపడి ఉంది.

ప్రస్తుతం రోహిత్ సేన ఆట చూస్తుంటే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మాట అటుంచితే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్‌పై కూడా ఆశలు గల్లంతవుతున్నాయి. ఇప్పటికే మూడో స్థానానికి వచ్చేసింది టీమిండియా. ఇదే పర్ఫామెన్స్‌ను కంటిన్యూ చేస్తే ఆడి ఓడటం కాదు.. ఆడకుండానే పరువు పోయేలా ఉంది. మరి ఇప్పటికైనా ఇండియన్ బ్యాట్స్‌మెన్ మేల్కోంటారో లేదో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com