37.2 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

సముద్ర మార్గంలో స్పీడ్ రైల్… రంగంలోకి ఎలన్ మస్క్

న్యూయార్క్ టు లండన్ గంటలో సీ ట్రైన్ జర్నీ..
హైపర్ లూప్ టెక్నాలజీపై ఎలన్ మస్క్ ద్రుష్టి…

దశాబ్దాల క్రితం ఒక కలగా ఊహించిన ఓ ప్రతిపాదన ఇప్పుడు నిజం కాబోతోందా? దూర తీరాలను ఏకం చేసేందుకు సముద్ర మార్గంలో స్పీడ్ రైల్స్ ప్రతిపాదనకు మళ్లీ రెక్కలు తొడుగుతున్నాయా? ఆ టెక్నాలజీ అమల్లోకి వస్తే న్యూయార్క్, లండన్ మధ్య ప్రయాణం గంటలో పూర్తవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం విమానంలో ఈరెండు ప్రాంతాల మధ్య జర్నీకి 8 గంటల సమయం పడుతోంది. ట్యూబ్ టెక్నాలజీ ఆచరణ సాధ్యం అయితే.. సముద్ర మార్గంలో ఒక ఎయిర్ టైట్ టన్నెల్ ద్వారా స్పీడ్ రైళ్లను నడపొచ్చని గంటకు మూడు వేల మైళ్ల స్పీడ్ తో ఆ రైళ్లు దూసుకుపోవచ్చని అంటున్నారు. ప్రఖ్యత సోషల్ మీడియా దిగ్గజం, అపర కుబేరుడు, టెక్నాలజీని అమితంగా ప్రేమించే ఎలన్ మస్క్ ఈ ఆలోచనలను చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నారట. అయితే ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యయం మాత్రం గుండె గుభేల్మనేలా ఉంది. దీని నిర్మాణానికి వ్యయం 20 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు అవుతుందని తెలుస్తోంది.

ఏమిటీ టెక్నాలజీ

దశాబ్దాల క్రితం ఒక ఊహగా చర్చకు వచ్చిన ట్యూబ్ టెక్నాలజీ పై బిలియనీర్, టెక్నాలజీ ప్రేమికుడు ఎలన్ మస్క్ ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. సముద్రమార్గంలో వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ ద్వారా టన్నెల్స్ నుంచి హైపర్ లూప్ సిస్టమ్ ద్వారా రైళ్లను నడపవచ్చని.. ఎయిర్ లీకేజీలు లేకుండా ఉంటే ఈ స్పీడ్ రైళ్లు దూసుకుపోతాయని అంటున్నారు.

హైపర్ లూప్ టెక్నాలజీ వినియోగంతో సముద్ర మార్గంనుంచి భూమిపై నడిచే ట్రైన్లకు అనుసంధానం చేసే విధానంపై భారత, చైనాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే విమాన ప్రయాణాలకన్నా కాలుష్యరహిత, వేగవంతమైన, సమర్దవంతమైన ప్రయాణంగా ఇది మారుతుంది.
ఈ టెక్నాలజీ ద్వారా స్పీడ్ జర్నీలు సాధ్యమైనా.. దానిని సాకారం చేయాలంటే అయ్యే ఖర్చు భరించడం చాలా చాలా కష్టం. ఫ్లోటింగ్ ట్యూబుల్లోనూ, సముద్ర మార్గంలో భూమిపై రైల్ నెట్ వర్క్ నియమించే ఆలోచనలపై కొందరు ఇంజనీర్లు ప్రయోగాలు కూడా చేశారు. కానీ భారీ వ్యయం, అనేక రిస్కులతో కూడుకున్న ట్రాన్స్ అట్లాంటిక్ సీ ట్రైన్ రూట్ సాకారం కావాలంటే కొన్ని శతాబ్దాలు పడుతుందనే అంటున్నారు ఇంజనీర్లు.. ఇంకా అత్యాధునిక టెక్నాలజీ పరిశోధనలు జరగాలంటున్నారు. హైపర్ లూప్ టెక్నాలజీ పై పరిశోధనలు మరింతగా ఫలిస్తే.. ఈ కల అసాధ్యం కాకపోయినా.. ఆలస్యంగానైనా నిజం అయ్యే అవకాశముంది. అప్పుడు నేలపైనా, నింగిలొనే కాదు.. సముద్ర మార్గంలో రైళ్ల ద్వారా కూడా మనం స్పీడ్ జర్నీ చేయచ్చు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com