36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

అల్లు అర్జున్ అరెస్ట్ అసాధారణం- అంతర్జాతీయ మీడియా

అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లోకల్, నేషనల్ మీడియానే కాదు అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11గా అరెస్ట్ అయిన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, మధ్యంతర బెయిల్ పై విడుదల అంశం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్…వైల్డ్ ఫైర్ అన్న డైలాగులు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాయో…ఇప్పుడు బన్నీ అరెస్ట్ అంశం కూడా అదే రేంజ్ లో వరల్డ్ వైడ్ ఫైర్ అయ్యింది. బీబీసీ వరల్డ్ అల్లు అర్జున్ అరెస్ట్, రిలీజ్ అంశాన్ని ప్రస్తావిస్తూ కథనాన్ని ప్రచురించింది. పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాల్లో తొక్కిసలాట ప్రమాదాలు జరగటం ఇండియాలో సాధారణమే అని, భద్రతా చర్యల లోపాలు, క్రౌడ్ మేనేజ్ మెంట్ వైఫల్యాలు ప్రధాన కారణం అని చెప్పిన బీబీసీ…ఇటువంటి సంఘటనల్లో ప్రముఖలను అరెస్ట్ చేయటం అసాధారణం అని అభిప్రాయపడింది. అటు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కూడా బన్నీ అరెస్ట్ అంశం పై వార్తను ప్రచురించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com